Bigg Boss OTT Telugu: దారుణ కామెంట్లు, అషూ, అజయ్‌లను తిట్టిపోస్తున్న నెటిజన్లు

Bigg boss Non Stop: Ashu Reddy, Ajay Trolled For Negative Comments - Sakshi

బిగ్‌బాస్‌ షోలో హద్దులు మీరి ప్రవర్తించినా, బూతులు మాట్లాడినా దాన్ని ఎడిటింగ్‌లో తీసే ఆస్కారం ఉండేది. కానీ బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలో మాత్రం అలాంటి చాన్స్‌ లేదు. 24 గంటలు లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉండటంతో కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా ప్రతీది ప్రేక్షకుడు ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. అయితే నాన్‌స్టాప్‌ షోలో ఆది నుంచి వల్గర్‌ జోకులు, బూతుపురాణం నడుస్తూనే ఉంది. ఈసారి ఆ హాస్యం మరింత హద్దు మీరింది. నిన్నటి కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్కులో అఖిల్‌, బిందును ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్‌. వీళ్లు మిగతా జోడీలకంటే బాగానే ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌కు సంచాలకురాలిగా ఉన్న అషూ మాత్రం ఎప్పటిలాగే తన నోటి దురుసు ప్రదర్శించింది.

అఖిల్‌.. మిత్ర దగ్గరకు వెళ్లి తనకు, బిందుకు రెండు యాపిల్స్‌, రెండు అరటిపండ్లు, రెండు ఆరెంజ్‌ కావాలని డీల్‌ మాట్లాడుకుంటున్నాడు. ఇది విన్న అషూ టాస్క్‌ ఆడబోతున్నారా? ఫస్ట్‌ నైట్‌కు పోతున్నారా? అంటూ సెటైర్‌ వేసింది. దీనికి అఖిల్‌ ఏమీ అనకుండా ఓ నవ్వు విసిరాడు. ఇక మరో చోట అఖిల్‌, అషూ, అజయ్‌, నటరాజ్‌ బెడ్‌ మీదకు చేరి ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో అఖిల్‌.. అజయ్‌ చెవిలో శివ, బిందు హీరోహీరోయిన్స్‌ అంటూ ఊదాడు. దీనికి అజయ్‌ దుప్పట్లో దడదడే అంటూ కామెంట్‌ చేయగా మధ్యలో అషూ అందుకుని ముసుగులో గుద్దులాట అని మాట్లాడింది. దీంతో ఓ అడుగు ముందుకేసిన అజయ్‌ గోడకేసి గుద్దు అంటూ ఓ టైటిల్‌ ఇచ్చాడు.

ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారగా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ఫైర్‌ అవుతున్నారు నెటిజన్లు. అషూ ఒక అమ్మాయి అయి ఉండి మరో ఆడదాని గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుందా? అని తిట్టిపోస్తున్నారు. ఇక నటరాజ్‌ మాస్టర్‌, అజయ్‌.. నామినేషన్స్‌ గురించి మాట్లాడుకున్నారు. హమీదా తల మీద చేయి వేసి మాట్లాడుతుంది. ఆమె తనకు అమ్మలాగా అనిపిస్తుందని, తనకోసమే నామినేట్‌ అయ్యానని అనిల్‌ బిందుతో చెప్పాడట అంటూ నటరాజ్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చాడు. దీనికి అజయ్‌.. వాడు అమ్మాయి టచ్‌ కోరుకున్నాడు అని అడ్డగోలుగా ఆన్సరిచ్చాడు. దీంతో అజయ్‌ను సైతం నెట్టింట ఆడేసుకుంటున్నారు. బిందుమాధవి, హమీదాలకు కనీస మర్యాద ఇవ్వండని డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి

చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-06-2022
Jun 09, 2022, 16:22 IST
హర్ష సాయి రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం...
03-06-2022
Jun 03, 2022, 13:21 IST
మొన్నటిదాకా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ (ఓటీటీ) సందడి చేసింది. ఇప్పుడు బుల్లితెరపై బిగ్‌బాస్‌ సీజన్‌ 6 అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన...
02-06-2022
Jun 02, 2022, 15:50 IST
కొన్నేళ్లుగా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉన్నాడని దీంతో ఈసారి కొత్త యాంకర్‌ను తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగార్జునను కాదని టాలీవుడ్‌...
26-05-2022
May 26, 2022, 11:32 IST
బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం.. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు...
24-05-2022
May 24, 2022, 18:27 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? అక్షరాలా.. ...
24-05-2022
May 24, 2022, 11:07 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు అఖిల్‌ గట్టి పోటీ ఇచ్చినా.. బిందు...
23-05-2022
May 23, 2022, 21:19 IST
Bigg Boss Telugu Non Stop: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌కు శనివారంతో ఎండ్‌కార్డ్‌ పడింది. బిగ్‌బాస్‌ ఓటీటీ తొలి సీజన్‌...
23-05-2022
May 23, 2022, 16:26 IST
అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్‌లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్‌ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన...
22-05-2022
May 22, 2022, 16:56 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్‌ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్‌ వచ్చిన...
22-05-2022
May 22, 2022, 15:10 IST
రన్నర్‌ అయినా మావాళ్లు నన్ను విన్నర్‌గానే ట్రీట్‌ చేస్తారు.  బిందు నా పండు. మేం చాలా సరదాగా ఉన్నాం. బిగ్‌బాస్‌...
22-05-2022
May 22, 2022, 13:49 IST
షో ప్రారంభంలో అయితే నోరు తెరిచి మాట్లాడేదే కాదు. తన అభిప్రాయాలను టిష్యూ పేపర్ల మీద రాసి వెల్లడించేది. ఈ...
22-05-2022
May 22, 2022, 13:37 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్‌ రేసులో ఉన్న అఖిల్‌ సార్థక్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా...
22-05-2022
May 22, 2022, 11:30 IST
గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ జరగ్గా నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్‌ శివ సెకండ్‌...
21-05-2022
May 21, 2022, 21:54 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో గ్రాండ్‌ ఫినాలే శనివారం (మే 20)...
21-05-2022
May 21, 2022, 21:19 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్‌, బాబా భాస్కర్‌, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్‌ రసవత్తరంగా...
21-05-2022
May 21, 2022, 20:07 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో గ్రాండ్ ఫినాలే జోరుగా ప్రారంభమైంది. ఈషోలో బాబా భాస్కర్‌ మాస్టర్‌ ప్రయాణం ముగిసిపోయింది. టాప్‌ 7...
21-05-2022
May 21, 2022, 19:20 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్‌ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. సిటీమార్‌ పాటలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లోకి వెళ్లేముందు...
21-05-2022
May 21, 2022, 13:26 IST
స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన అనిల్‌ రావిపూడి ఓ సూట్‌కేసుతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు. అంటే హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరో...
20-05-2022
May 20, 2022, 21:00 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్‌ ఫినాలేకి చేరుకున్న...
19-05-2022
May 19, 2022, 20:38 IST
గీతూ రాయల్ ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తుంది. చిత్తూరు యాసలో బెరుకు లేకుండా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. కానీ... 

Read also in:
Back to Top