‘ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 3.. ఈ సారి చైనా టార్గెట్‌

Directors Busy With Family Man Season 3 Script - Sakshi

మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత అక్కినేని, ప్రియమణి కీలక పాత్రలో దర్శకులు రాజ్‌నిడిమోరు- కృష్ణ డీకేలు తాజాగా తెరకెక్కించిన వెబ్‌ సీరిస్‌ ‘ప్యామిలీ మ్యాన్‌ 2. ఇటీవల ఆమెజాన్‌ ప్రైమ్‌లో ల విడుదలైన ఈ సిరీస్‌ కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక వెబ్‌ సిరీస్‌కు ఇంత ఫాలోయింగ్‌ ఉంటుందా?.. ఒక్కరోజులోనే కోట్ల వ్యూస్‌ తెచ్చిపెట్టె సత్తా ఉంటుందా?  సినిమాలను మించిన పారితోషికం అందుకునే సీన్‌ ఉందా అని ప్రశ్నించే వారందరికి ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఒక సమాధానంగా నిలిచింది.

డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సిరీస్‌ను.. అంతే రేంజ్‌లో వివాదాలు కూడా చూట్టుముట్టాయి. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సీరిస్‌ కాంట్రవర్సీల కారణంగా మూడు నెలలు ఆలస్యంగా విడుదలైంది. అయినా కానీ ప్రస్తుతం ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైంలో అత్యధిక వ్యూస్‌ రాబట్టిన వెబ్‌ సిరీస్‌గా రికార్డు నెలకొల్పింది. అయితే తొలి సీజన్‌ 2018లో విడుదల కాగా రెండవ సీజన్‌ను రూపొందించడానికి దర్శకుడు మూడేళ్ల సమయం తీసుకున్నాడు. కానీ ఈ సారి అంత ఆలస్యం చేయకుండా వెంటనే సీజన్‌ 3 కోసం కథను సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మొదటి సీజన్‌ ఇండియా- పాకిస్తాన్‌ టెర్రరిజం చూట్టూ కథ సాగగా, సెకండ్‌ సీజన్‌ ఇండియా-శ్రీలంక టెర్రరిజం చూట్టూ కథ అల్లుకుంది. అయితే 3వ సీజన్‌ కోసం దర్శకుడు చైనాను టార్గెట్ చేయనున్నాడని వినికిడి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్‌ 3 ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండో సీజన్ చివర్లో ఒక చైనీస్ వ్యక్తి కంప్యూటర్‌లో ఏదో చైనా భాషలో టైప్ చేస్తూ కనిపిస్తాడు. దీన్ని బట్టి మూడో భాగం అంతా ఇండియా-చైనా నేపథ్యంలో ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్‌లో కూడా మనోజ్ బాజ్‌పాయ్‌ కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. 

చదవండి: 
ఫ్యామిలీ మ్యాన్‌ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top