Vignesh Shivan: 2022 నాకెంతో స్పెషల్.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్‌ పోస్ట్

Director Vignesh Shivan Emotional post About 2022 year Ends goes viral - Sakshi

సంచలన నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్‌​ శివన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2016 నుంచి సహజీవనం చేసిన జంట 2022 జూన్‌లో వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్‌ సేతుపతి జంటగా నటించిన నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రానికి విగ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంటకు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. తాజాగా విఘ్నేశ్ శివన్‌ 2022కు గుడ్‌ బై చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. 

గతేడాదిలో జరిగి విషయాలను విఘ్నేశ్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తనకు 2022 ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. నయనతారతో పెళ్లి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆశీస్సులు మరిచిపోలేనివని తెలిపారు. 2022లోనే ఇద్దరు పిల్లలు జన్మించడం దేవుడిచ్చిన వరమన్నారు విఘ్నేశ్. అలాగే 'కాతువాక్కుల రెండుకాదల్‌' మూవీ రిలీజ్, తమిళనాడు ప్రభుత్వం చెస్‌ ఒలిపింయాడ్ ఆహ్వానం, నయనతార 'కనెక్ట్‌' మూవీ, తన తదుపరి ప్రాజెక్ట్‌ లైకా ‍ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఏకే62 ఇందులో ప్రస్తావించారు. మధురమైన క్షణాలను మిగిల్చిన 2022కు గుడ్‌బై చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు శివన్. ఈ ఏడాది మరింత సంతోషంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top