రాజమౌళికి నెగటివ్‌ | Director SS Rajamouli and Family Test Negative for Covid-19 | Sakshi
Sakshi News home page

రాజమౌళికి నెగటివ్‌

Aug 13 2020 12:35 AM | Updated on Aug 13 2020 12:35 AM

Director SS Rajamouli and Family Test Negative for Covid-19 - Sakshi

దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి

ప్రముఖ దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో జూలై 29 నుంచి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘‘రెండు వారాల హోమ్‌ క్వారంటైన్‌ పూర్తయింది.

ఈ సందర్భంగా నాకు, నా కుటుంబ సభ్యులకు బుధవారం నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చింది. రెండు వారాల క్వారంటైన్‌  అనంతరం మాలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదు’’ అని రాజమౌళి పేర్కొన్నారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు తగినంత రోగనిరోధక శక్తి అభివృద్ధికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement