మ్యూజిక్ మీద చాలా రీసెర్చ్ చేశా: డైరెక్టర్‌ శివ పాలడుగు | Director Siva Paladugu Talk About Music Shop Murthy Movie | Sakshi
Sakshi News home page

అందుకే ఆ పాత్ర అజయ్‌ ఘోష్‌తో చేయించా: ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ డైరెక్టర్‌

Published Wed, Jun 12 2024 6:00 PM | Last Updated on Wed, Jun 12 2024 6:39 PM

Director Siva Paladugu Talk About Music Shop Murthy Movie

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఇప్పుడు లేదు. కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’సినిమాను తీశాం. మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’అన్నారు డైరెక్టర్‌ శివ పాలడుగు. ఆయన దర్శకత్వం వహించిఆన తొలి సినిమా ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్‌ శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. కొన్నాళ్ల తర్వాత అక్కడే  డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.

కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి పాత్ర కోసం అజయ్‌ ఘోష్‌ని తీసుకున్నాం. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.

చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.

ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.

ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు.

ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను.  ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement