రెండుగంటలు నవ్వుతూనే ఉంటారు

Director Sanjay Sheri Speech At Sound Party Movie - Sakshi

– సంజయ్‌ శేరి

‘‘అమాయకులైన తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథే ‘సౌండ్‌ పార్టీ’. ఈ పాత్రలకి శివన్నారాయణ, సన్నీ కరెక్ట్‌గా సరిపోయారు. నా నిజ జీవితంలోని అనుభవాల నుంచి వినోదాత్మకంగా ఈ చిత్ర కథను రాశాను. ఈ సినిమాతో రెండు గంటలపాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అని డైరెక్టర్‌ సంజయ్‌ శేరి అన్నారు. వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్‌ జంటగా శివన్నారాయణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’.

జయ శంకర్‌ సమర్పణలో ఫుల్‌ మూన్‌ మీడియాపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్‌ శేరి మాట్లాడుతూ–‘‘మాది కామారెడ్డి. పూరి జగన్నాథ్‌గారిని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్‌ కావాలనుకున్నా. దర్శకులు మారుతి, సంపత్‌ నందిగార్ల వద్ద రచనా విభాంగలో పనిచేశా. జయశంకర్‌ ద్వారా నిర్మాతలకు ‘సౌండ్‌ పార్టీ’ కథ వినిపించాను.. వారికి నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌ ఆరంభించాం. శివ కార్తికేయన్‌గారితో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top