కల నెరవేర్చుకున్న బిగ్‌బాస్‌ విన్నర్‌ | Bigg Boss Winner VJ Sunny Ventures Into Salon Business, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

సెలూన్‌ బిజినెస్‌లోకి వీజే సన్నీ.. గ్రాండ్‌గా ఓపెనింగ్‌..

Jul 14 2024 1:05 PM | Updated on Jul 14 2024 2:16 PM

Bigg Boss Winner VJ Sunny Ventures into Salon Business

బిగ్‌బాస్‌ విన్నర్‌, హీరో వీజే సన్నీ తన కల నెరవేర్చుకున్నాడు. ఒక సెలూన్‌ ప్రారంభించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. ద బార్బర్‌ క్లబ్‌ (టీబీస్‌) సెలూన్‌ ఫ్రాంచైజీని హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్‌కు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలే మానస్‌, సోహైల్‌, ఆర్జే కాజల్‌, దీప్తి సునయన తదితరులు హాజరై సందడి చేశారు.

ద బార్బర్‌ క్లబ్‌ సెలూన్‌ను ప్రవేశపెట్టిన జోర్డాన్‌ హైదరాబాద్‌లో ఫ్రాంచైజీ ఓపెనింగ్‌కు విచ్చేశాడు. అతడికి హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోను సన్నీ షేర్‌ చేస్తూ నేటి నుంచి సెలూన్‌ అందుబాటులోకి వచ్చేసిందని తెలిపాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెలూన్‌ తెరిచి ఉంటుందని పేర్కొన్నాడు.

ఇది చూసిన అభిమానులు మొత్తానికి బిగ్‌బాస్‌ షోలో చెప్పిన కలను సాధించేశావు.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొని విజేతగా అవతరించాడు. చివరగా సౌండ్‌ పార్టీ సినిమాలో నటించాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

 

 

 

 చదవండి: సినీ‘వారం’: సాయితేజ్‌ ట్వీట్‌.. మంచు విష్ణు ఫైర్‌.. సారీ చెప్పిన సిద్ధార్థ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement