Director N Lingusamy : కోలీవుడ్‌లో సంచలనం.. డైరెక్టర్‌ లింగుస్వామికి జైలు శిక్ష

Director N Lingusamy And His Brother Sentenced To 6Months Imprisonment - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌, 'ది వారియర్‌' మూవీ డైరెక్టర్‌ లింగుస్వామికి కోర్టుషాక్‌ ఇచ్చింది. చెక్‌బౌన్స్‌ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంతలు హీరోహీరోయిన్లుగా సినిమాను ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ అనే ఓ సినిమాను తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ భావించారు.

ఇందుకోసం పీవీపీ సినిమాస్ అనే కంపెనీ నుంచి రూ. 35లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న సొమ్మును చెక్‌ రూపంలో తిరిగి చెల్లించారు. కానీ ఆ చెక్‌బౌన్స్‌ అవ్వడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం డైరెక్టర్‌ లింగుస్వామి, అతని సోదరుడు చంద్రబోస్‌లకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

అంతేకాకుండా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మద్రాస్‌ హైకోర్టులో లింగుస్వామి పిటిషన్‌ వేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top