స్టార్ డైరెక్టర్ కూతురు షాకింగ్ నిర్ణయం.. నిజమేనా? | Aditi Shankar Quit From Movies Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Aditi Shankar: అప్పుడే సినిమాలకు టాటా చెప్పనుందా?.. సోషల్ మీడియాలో వైరల్!

Published Tue, Nov 21 2023 12:00 PM

Director Daughter Aditi Shankar Quit From Movies Goes Viral IN Social Media - Sakshi

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌. చాలా చలాకీగా ఉండే ఈమె మల్టీ టాలెంటెడ్‌. చదివింది వైద్య విద్య అయినా నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగు పెట్టింది. దీంతో ఎలాగైనా కథానాయకిగా నటించాలనే పట్టుదలతో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించారు. అలా విరుమాన్‌ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా నటించి మెప్పించారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే గాయని అవతారం ఎత్తి తన మల్టీ టాలెంటెడ్‌ను నిరూపించుకున్నారు.

 ఆ చిత్రం తరువాత శివకార్తికేయన్‌ సరసన మావీరన్‌ చిత్రంలో నటించారు. ఈ రెండు సూత్రాలు సక్సెస్‌ అయ్యి అదితి శంకర్‌ను లక్కీ హీరోయిన్‌ చేశాయి. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో ఆకాష్‌ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. తదుపరి రాక్షసన్‌ చిత్రం ఫేమ్‌ రాంకుమార్‌ దర్శకత్వంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్‌ నటనకు గుడ్‌ బై చెప్పనున్నారనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆమె డాక్టర్‌ దుస్తులు ధరించిన ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అవ్వడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆమె నిజంగానే నటనకు గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? లేక ఏదైనా చిత్రంలోని ఫొటోలను సామాజి మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కథానాయకగా సక్సెస్‌ బాటలో పయనిస్తున్న అదితి శంకర్‌ నటనకు గుడ్‌ బై చెబుతున్నారన్న వార్త అభిమానులకు నమ్మశక్యంగా లేదు. అయితే ఈ విషయమై ఆమె సైతం మౌనం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఉండటానికి ఇష్టపడే అదితి శంకర్‌ చేస్తున్న కొత్తరకం పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement