స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు | Director AL Vijay Car Attack By An Unknown Person In T Nagar, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Director AL Vijay Car Attack: కారు ఆపి స్టార్ డైరెక్టర్‌తో గొడవ.. అతడికి స్వల్ప గాయాలు!

Published Sat, Dec 30 2023 8:35 AM

Director Al Vijay Car Attack By An Unknown Person - Sakshi

హీరో విజయకాంత్ చనిపోవడంతో, ఆయ‍నకు నివాళి అర్పించడానికి వెళ్లిన దళపతి విజయ్‌పై ఓ వ‍్యక్తి చెప్పుతో దాడి చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దీని గురించి అందరూ అనుకునేలోపే తాజాగా మరో సంఘటన వైరల్ అయింది. ప్రముఖ దర్శకుడు-స్టార్ హీరోయిన్ మాజీ  భర్త కారుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. రోడ్డుపై చాలా పెద్ద గొడవ పడ్డాడు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'నాన్న' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్.. హీరోయిన్ అమలాపాల్‌ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడిపోయారు. ఆ తర్వాత 2019లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్, కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన తీసిన 'మిషన్ చాప్టర్-1' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

అయితే మూడు నాలుగు రోజుల ముందు చెన్నైలో వెళ్తుండగా, ఓ వ్యక్తి వచ్చిన ఏఎల్ విజయ్ కారుపై దాడి చేశాడు. ఆ సమయంలో కారులో డైరెక్టర్ విజయ్‌తోపాటు మేనేజర్ మణివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. కారుకి అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తి.. ఏఎల్ విజయ్‌తో వాగ్వాదానికి దిగాడు. హెల్మెట్‌తో పలుమార్లు కారుపై కొట్టాడు. ఈ దాడిలో మేనేజర్‌కి స్వల్ప గాయాలైనట్లు డైరెక్టర్ చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి.. పోలీసుల అదుపులోనే ఉన్నాడు. 

(ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)

Advertisement
 
Advertisement
 
Advertisement