నేను తాగింది మందు కాదు: హీరోయిన్‌

Dhanya Balakrishna: Did Not Drink Alcohol In That Scene - Sakshi

తమిళ హీరో, టాప్‌ హీరోయిన్‌ శృతీ హాసన్‌ జంటగా నటించిన 'సెవంత్‌ సెన్స్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ధన్య బాలకృష్ణ. ఆ తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌, ఎటో వెళ్లిపోయింది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు మల్టీస్టారర్‌ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో ఒక సీన్‌లో నటించి మెప్పించింది.

'నేను శైలజ', 'రాజు గారి గది', 'రాజారాణి', 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' వంటి పలు చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని వెల్లడించింది. 'రాజారాణి' సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది.

ఎక్కువగా పార్టీలు కూడా చేసుకోనని, ప్రతి వీకెండ్‌లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది. పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్‌లని, వీరితో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కన్నా తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది.

చదవండి: 'ఆ సీరియల్‌ నటుడితో ప్రియాంకకు పెళ్లి చేయాలనుకున్నారట'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top