
పాపులర్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ధనుష్ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొద్దిరోజులుగా హిందీ బెల్ట్లో ఈ డేటింగ్ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. దీనంతటికి కారణం వీరిద్దరూ కొన్ని ఈవెంట్లలో సన్నిహితంగా కనిపించడమేనని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారిద్దరూ కలిసి ఒక వేడుకలో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరల్ అయింది. ఆపై మృణాల్ ఠాకూర్ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా ముంబైకి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. జులై 3న ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్ బాలీవుడ్ సినిమా 'తేరే ఇష్క్ మే' షూటింగ్‌ను ముగించాడు. ఈ సందర్భంగా జరిగిన పార్టీకి మృణాల్ హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు.
వారిద్దరితో పాటు తమన్నా భాటియా, కనికా ధిల్లాన్, భూమి పెడ్నేకర్ కూడా కనిపించారు. ఇలా పలు సందర్భాల్లో వారిద్దరూ కెమెరాలకు కనిపిస్తూ ఉండటంతో డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ గానీ, మృణాల్ గానీ ఈ పుకార్లపై అధికారికంగా స్పందించలేదు. నెటిజన్లు మాత్రం వీడియోలు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. వారు ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారని కనీసం వారికి అయినా తెలుసా..? అంటూ రూమర్స్ వ్యాప్తి చేసే వారికి పంచ్ డైలాగ్‌తో ఇచ్చాడు.
Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a
— Aryan (@Pokeamole_) August 3, 2025