అన్నదమ్ముల కాంబినేషన్లో చిత్రం 

Dhanush To Begin Shoot For Selvaraghavan Action Thriller Naane Varuven In August - Sakshi

తమిళ సినిమా: అన్నదమ్ములైన దర్శకుడు సెల్వరాఘవన్, నటుడు ధనుష్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. వీరు ఇంతకుముందు కాదల్‌ కొండేన్, పుదుపేటై, మయక్కమ్‌ ఎన్నా వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 10 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం తెరకెక్కనుంది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను తన వి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నానే వరువేన్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టు 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు నిర్మాతల వర్గం అధికారికంగా వెల్లడించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top