'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు? | Devara Movie Actors Remuneration Details, Rs 10 Crores For This Actor, Deets Inside | Sakshi
Sakshi News home page

Devara Actors Remuneration: 'దేవర' కోసం ఎన్టీఆర్‌కి అన్ని కోట్ల పారితోషికం?

Published Fri, Sep 27 2024 9:05 AM | Last Updated on Sat, Sep 28 2024 12:32 PM

Devara Movie Actors Remuneration Details

'దేవర' థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే 'దేవర'కి బడ్జెట్ ఎంత? రెమ్యునరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా 'దేవర'. గతంలో తారక్‌తో 'జనతా గ్యారేజ్' తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

పారితోషికాల విషయానికొస్తే 'దేవర'లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్‌గా చేసిన జాన్వీ రూ.5 కోట్లు, విలన్‌గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు,  మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement