చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి

Comedian Gautham Raju son coming as a hero with Krishna Rao Supermarket - Sakshi

‘‘చిరంజీవిగారంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్‌ తర్వాత  కొన్ని రోజులు ఉద్యోగం చేశా. ఆ తర్వాత నాన్నగారికి తెలియకుండానే సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆడిష¯Œ ్సలో ‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’ చిత్రంలో హీరోగా ఎంపికయ్యా’’ అని హాస్యటుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘తొలి ప్రయత్నం ‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది.

నాకు మాస్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవిగారి నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందేది ఫైట్స్, డ్యా¯Œ ్స. నా తొలి సినిమా ఇంకా ఆయన వద్దకి చేరలేదని బాధపడుతున్నా. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదగా ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలన్నది నా పెద్ద కల. అందుకోసం ఎంతైనా కష్టపడతా. దర్శకుల్లో సుకుమార్‌గారు అంటే చాలా ఇష్టం. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, రాజమౌళి, హరీష్‌ శంకర్‌గార్ల కూడాæ ఇష్టం. నటుడిగా నిరూపించుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను ’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top