Comedian Ali: కమెడియన్‌ అలీ ఇంట పెళ్లిసందడి.. వరుడు ఎవరో తెలుసా?

Comedian Ali Daughter Engegement And To Know Groom Details - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె లైగర్‌ సినిమాలో నటించారు. ఈమధ్య సినిమాల కంటే బుల్లితెర‌పై హోస్ట్‌గా,జడ్జిగా అలరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జుబేదా అలీ సైతం సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌తో పాపులారటీ దక్కించుకున్నారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదిలా ఉండగా అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎంగేజ్‌మెంట్‌ వీడియోను జుబేదా అలీ తన ఛానెల్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్‌ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

చదవండి: కమెడియన్‌ అలీ కూతురి ఎంగేజ్‌మెంట్‌ చూశారా?

అయితే అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే అలీ అల్లుడు డాక్టర్‌ అని తెలుస్తుంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్‌ కంప్లీట్‌ చేసింది. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్‌ అంటూ అలీ దంపతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top