Chiranjeevi: అభిమానులకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేయిస్తా, ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా

Chiranjeevi Reveals That He Once Fight with Cancer - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తాను ఒకప్పుడు క్యాన్సర్‌ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించాడు. కొలనో స్కోపీ చేయించుకొని దాని నుంచి బయటపడినట్లు తెలిపాడు. ప్రారంభ దశలోనే ఓ ఇన్ ఫెక్షన్‌ను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ పోరాటంలో విజయం సాధించానని తెలిపాడు. క్యాన్సర్‌ గురించి చెప్పడానికి తాను భయపడలేదని పేర్కొన్నాడు.

జీనోమిక్స్ టెస్ట్ ద్వారా ముందస్తుగానే క్యాన్సర్‌ను గుర్తించవచ్చని చెప్పాడు. అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని, వారికోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నాడు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలని ఆకాంక్షించాడు. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ క్యాన్సర్ స్కీనింగ్ చేయాలని ఆసుపత్రులను కోరాడు. క్యాన్సర్‌పై అవగాహన కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చాడు. కాగా చిరంజీవి గతంలో పలుమార్లు క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

చదవండి: రైలు ప్రమాదం.. కమెడియన్‌ అనుచిత ట్వీట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top