Chiranjeevi: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్‌ ఫొటో

Chiranjeevi Remuneration Was Bigger Than Amitabh Bachchan In 1990s - Sakshi

మెగాస్టార్ చిరంజీవి నిన్నటితో (ఆగస్ట్ 22న) 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. ఇక అభిమానులు, సెలబ్రెటిల నుంచి ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఆయన బర్త్‌డే సందర్భంగా చిరుకు సంబంధించిన ఓ ఆసక్తిర విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌ మెగాస్టార్‌గా ఎదిగిన చిరు తన కాలంలో తెలుగు సినీ పరిశ్రమను ఓ స్థాయిలో నిలబెట్టారు. అప్పట్లోనే  ఓ భారతీయ సినిమా హాలీవుడ్‌ వెండితెరపై ప్రదర్శితమవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి ఘనత ఒక్క చిరంజీవికే దక్కింది. ఆయన నటించిన కొదమసింహాం హాలీవుడ్‌లో ‘హంటర్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్’ పేరుతో డబ్‌ అయ్యింది.

చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్‌ గౌతమ్‌ రాజు కుమారుడు

అంతగా తెలుగు పరిశ్రమకు గుర్తింపు తెచ్చిపెట్టిన ఆయన మొదట ఓ సాధారణ నటుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత 1980 వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని తిరుగులేని స్టార్డడమ్ సంపాదించుకున్నారు. అలా 1990లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఆయన ముందువరుసలో ఉన్నారు. అంతేకాదు ఒకానోక  సమయంలో భారత చలనచిత్ర పరిశ్రమలోని నటుల కంటే కూడా ఆయనే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ కంటే కూడా చిరునే అధిక పారితోషికం అందుకున్నారు. అప్పట్లో ఇది దేశమంతట చర్చనీయాంశమైంది. ఓ నేషనల్‌ మ్యాగజైన్‌ అయితే దీన్ని కథనంగా ప్రచురితం చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యాగజైన్‌ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. 1992లోనే చిరు ఓ సినిమాకు రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారు.

చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే

ఇదే విషయాన్ని 1992 సెప్టెంబర్ 13న ది వీక్ మ్యాగజైన్ తన సంచికలో చిరు ఒక సినిమాకు రూ. 1.25 కోట్లు భారీ పారితోషికం తీసుకున్నారని వెలువరించింది. దీని మెయిన్‌ పేజీలో బచ్చన్‌ కంటే పెద్ద స్టార్‌ అంటూ పెద్ద అక్షరాలతో ట్యాగ్‌ లైన్‌ ఇచ్చింది. కాగా 1990లో చిరు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సెన్సెషన్ సృష్టించాడు. కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, అపద్భాంధవుడు, ముఠామేస్త్రీ వంటి చిత్రాలు చిరు కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. అప్పట్లో తెలుగు సినిమా అన్న, తెలుగు హీరోలన్న ఉత్తారాదిలో కాస్తా చిన్న చూపు ఉండేదనే విషయం తెలిసిందే. అదే సమయంలో చిరు ఈ ఘనత సాధించడమంటే నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం ఇది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top