Chiranjeevi and Balakrishna to Remix Their Own Songs For Upcoming Movies - Sakshi
Sakshi News home page

చిరు ఆ పాటను, బాలయ్య ఈ పాటను.. రీమిక్స్‌ కొట్టేస్తున్నారుగా!

Feb 28 2023 7:07 PM | Updated on Feb 28 2023 7:41 PM

Chiranjeevi And Balakrishna To Remix Their Own Songs For Upcoming Movies - Sakshi

టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ కొత్తేమీ కాదు.. తమ అభిమాన హీరోలు పాటలను...యంగ్ హీరోస్ రీమిక్స్ చేసి తమ సినిమాకి హైప్ తెచ్చుకుంటారు. అయితే  ఇప్పటి వరకు ఏ హీరో తన పాటలనే తను నటించే సినిమా కోసం రీమిక్స్ చేసుకోలేదు. కానీ టాలీవుడ్ ఇద్దరు హీరోలు కొత్త ట్రెండ్ ను సెట్ చేయటానికి ట్రై చేస్తున్నారు. తమ సినిమాల్లోని హిట్‌ సాంగ్స్‌ని నయా మూవీస్‌లో రీమేక్‌ చేయబోతున్నారు.

వాల్తేరు వీరయ్య మూవీలో తన వింటేజ్ లుక్ ... మ్యానరిజమ్స్ ప్రేక్షకులకి ఒక్కప్పటి చిరంజీవిని గుర్తు చేశాడు. అందుకే బోళాశంకర్ లో వింటేజ్ చిరంజీవి లుక్ ను మాత్రమే కాకుండా...అభిమానులకు కిక్ ఇచ్చేందుకు చిరు మరో ఎక్స్‌ఫర్మెంట్ కి రెడీ అయ్యాడు. తన సినిమాలోని ఓ హిట్ సాంగ్ ను...బోళాశంకర్ లో రీమిక్స్ చేయిస్తున్నట్లు సమాచారం. 

గతంలో చిరంజీవి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చూడాలని వుంది సినిమా చేశాడు. ఆ సినిమాలో రామ చిలకమ్మా పాట సూపర్ హిట్ అయింది. బోళాశంకర్ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్   మహతి స్వర సాగర్ ఈ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. చిరు బోళాశంకర్ లో తన పాట రీమిక్స్ చేయమని చెప్పటానికి  ఒక రీజన్ వుంది. వాల్తేరువీరయ్య సినిమాలో తన ఓల్డ్ సాంగ్ కి శృతిహాసన్ తో కలిసి స్టెప్స్ వేశాడు..ఆ డ్యాన్స్ ను ఫ్యాన్స్ బాగా ఎంజాయి చేశారు.  తన సినిమాలోని  ఓ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తే అభిమానులు ఇంకా బాగా ఎంజాయి చేస్తారనే ఐడియాతోనే చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. 

ఇక  బాలకృష్ణ కూడా వీరసింహా రెడ్డి తర్వాత  తన నెక్ట్స్ ప్రాజెక్ట్ (NBK108) స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.  డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ గా నటించి వింటేజ్ బాలకృష్ణను గుర్తు చేశాడు. దీంతో NBK108 టీమ్ కూడా బాలకృష్ణ ఓల్డ్ మూవీలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతుందట.

బాలకృష్ణ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సమరసింహారెడ్డి.. ఈ సినిమాలోని  అందాల ఆడబోమ్మ పాటను మళ్లీ రీమిక్స్ చేస్తున్నారనే న్యూస్ నెట్టింట వైరల్ మారింది.   తమన్‌ మ్యూజిక్ లో ఆ సాంగ్ రీమిక్స్ అయితే ఇంకా అదిరిపోతుందని బాలకృష్ణ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల డాటర్ గా నటించే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ నటించనుందట. అయితే  అందాల ఆడబొమ్మ రీమిక్స్ చేస్తారా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్‌ మాత్రం  క్లారిటీ  ఇవ్వలేదు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement