25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ | Chennakesava Reddy Movie Re Release Press Meet | Sakshi
Sakshi News home page

Chennakesava Reddy Movie: 25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్

Published Fri, Sep 23 2022 12:53 AM | Last Updated on Fri, Sep 23 2022 5:01 PM

Chennakesava Reddy Movie Re Release Press Meet - Sakshi

‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్‌ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్‌ ఆదరించాలి’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్‌ 25న రిలీజైంది.

ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్‌. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్‌ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్‌’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు.

బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్‌ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్‌ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్‌ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్‌లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్‌’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్‌కి ఇస్తాను. నవంబర్‌ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్‌ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement