ఓటీటీలోకి బెల్లంకొండ హిందీ మూవీ.. ఆరునెలల తర్వాత ఇప్పుడు | Bellamkonda Srinivas Chatrapathi OTT Release Date | Sakshi
Sakshi News home page

Chatrapathi OTT: బెల్లంకొండ 'ఛత్రపతి'కి మోక్షం.. ఇన్నాళ్లకు ఓటీటీలో

Nov 21 2023 4:56 PM | Updated on Nov 21 2023 5:10 PM

Chatrapathi OTT Release Date Bellamkonda Srinivas - Sakshi

రీసెంట్ టైమ్స్‌లో థియేటర్లలో రిలీజైన ఎలాంటి సినిమా అయినా సరే నెల, నెలన్నరలోపే ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. అలాంటిది ఓ సినిమాని దాదాపు ఐదారు నెలల రిలీజ్ చేయకుండా అలా ఉంచేశారు. ఇప్పుడేమో చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? అసలు దీనికి కారణమేంటి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్‌కి తగ్గట్లు మన హీరోలు.. బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. 'ఛత్రపతి' రీమేక్‌తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనే ఒక్కటి తప్ప మరో హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది హిందీలో, అదీ కూడా ఓ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే మరీ దారుణం.

ఈ ఏడాది మే 12న రిలీజైన ఈ సినిమాని థియేటర్లలో జనాలు చూడలేకపోయారు. దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ మూవీ గురించి మర్చిపోయారు. ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ ట్రోలర్స్ బెల్లంకొండ మూవీపై విరుచుకుపడుతున్నారు. థియేటర్లలో చూడటానికి చాలా కష్టపడ్డారు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement