ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటి.. ఫోటోలు వైరల్‌ | Chak De India Tanya Abrol Married To Ashish Verma See Pics | Sakshi
Sakshi News home page

Tanya Abrol : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటి.. ఫోటోలు వైరల్‌

Feb 11 2023 12:14 PM | Updated on Feb 11 2023 2:27 PM

Chak De India Tanya Abrol Married To Ashish Verma See Pics - Sakshi

బాలీవుడ్‌లో ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా 'చక్‌దే ఇండియా'ఫేం తాన్యా అబ్రోల్‌ బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడింది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చంఢీగర్‌లో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ కాగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఓ పార్టీలో కలిసిన తాన్యా-ఆశిష్‌లు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. తమ రిలేషన్‌షిప్‌ గురించి తాన్యా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'ఆశిష్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. కానీ తను ఇంట్రోవర్ట్‌. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. దీంతో తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఓసారి తెలిసిన అబ్బాయితో డేట్‌కు వెళ్తున్నా అని చెప్పగానే ఆశిష్‌ ముఖం మాడిపోయింది.

నిజంగానే వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికీ వెళ్లకు. మనం ఇద్దరం డేట్‌కు వెళదాం అంటూ క్యూట్‌గా ప్రపోజ్‌ చేశాడు. అప్పటి నుంచి మా ప్రేమ ప్రయాణం పెళ్లిదాకా వచ్చింది' అంటూ తాన్యా చెప్పుకొచ్చింది. కాగా తాన్యా 'చక్‌ దే ఇండియా' సినిమాతో పాపులర్‌ అయ్యింది. రీసెంట్‌గానే  ఈ సినిమాలోని చిత్రాశి రావత్ కూడా తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement