
'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో సిద్ధమైపోయారు. గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.
చైతన్య రావు, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా చేయబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కెఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' తర్వాత పూర్ణగారితో ఓ మూవీ చేయాలి. హిట్స్‌లో ఉన్నప్పుడు చేయను, బాధల్లో ఉన్నప్పుడు చేస్తానని ఆయనతో చెప్పాను. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పుకొచ్చారు.