పుష్ప-2లో సాయిపల్లవి పాత్ర అదేనా?

Buzz Is That Sai Pallavi As Tribal Girl In Pushpa2 The Rule - Sakshi

తమిళసినిమా: ప్రేమమ్‌ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. ఆ చిత్ర సక్సెస్‌తో ఈమె దక్షిణాది భాషల్లో మంచినటిగా పేరు సంపాదించింది. ముఖ్యంగా తెలుగులో నటనకు అవకాశం వున్న పాత్రలు ఈమెను వరిస్తున్నాయి. గ్లామర్‌కు దూరంగా సహజత్వంతో కూడిన నటనతో అభిమానులను అలరిస్తోంది. ఇటీవల విడుదలైన గార్గీ చిత్రం సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

కాగా పుష్ప–2 చిత్రంలో ఈమె ఆదివాసి యువతీగా అవకాశం ఉన్న పాత్రలో నటించననున్నట్లు తాజా సమాచారం. అల్లుఅర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించడంతో పాటు నటి రష్మిక మందన్న బాలీవుడ్‌ ఎంట్రీకి కారణమైంది. తాజాగా పుష్ప సీక్వెల్‌కు సుకుమార్‌ సిద్ధమవుతున్నారు.

పుష్ప చిత్రం సంచలన విజయం సాధించడంతో దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి కథ, కథలను తయారు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో నటుడు సేతుపతి కీలకపాత్రలో నటించబోతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. అదేవిధంగా నటి సాయిపల్లవి ఇందులో ఆదివాసీ యువతిగా బలమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్‌ అధికారకంగా ప్రకటించలేదు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top