Brahmastra Collections: వసూళ్లలో బ్రహ్మస్త్ర రికార్డ్.. విడుదలైన తొలివారంలోనే..‘

Brahmastra Movie Crossed 300 crore Collections In A Week - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించింన మూవీ బ్రహ్మస్త్ర-1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే 300 కోట్ల మార్కును దాటింది. ఇండియాలో ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకన్న సందర్భంగా నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

(చదవండి: Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్‌ అన్ని లక్షలా?)

ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన నిర్మాత కరణ్ జోహార్ 'ప్రేమ, వెలుగు కలిసి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండోవారంలోకి ప్రవేశిస్తున్నాం' అని వెల్లడించారు. 9/11 వార్షికోత్సవం సందర్భంగా హాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు విడుదల కాకపోవడంతో బ్రహ్మస్త్ర ఊహించిన దానికంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించింది.

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు.  భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top