Brahmanandam: Interesting Comments On Samantha Oo Antava Song Memes - Sakshi
Sakshi News home page

Oo Antava Song: పుష్ప ఐటం సాంగ్‌ మీమ్స్‌పై స్పందించిన బ్రహ్మానందం.. ఎంత దుర్మార్గం?

Dec 24 2021 8:23 PM | Updated on Dec 25 2021 10:38 AM

Brahmanandam Interesting Comments On Samantha Oo Antava Song Memes - Sakshi

'మా బ్రహ్మానందం స్టైల్‌ను కాపీ చేయొకండి సామ్‌.. అంటూ ఓ ఫన్నీ మీమ్‌ వదలగా అది సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. బ్రహ్మానందం సదరు మీమ్‌ చూసి.. 'నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అలా అన్నాను..

Brahmanandam About Pushpa Item Song: పుష్ప సినిమా ఎంత హిట్టయ్యిందో అందులోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' అనే పాట అంతకంటే పెద్ద హిట్టయ్యింది. ఇక ఈ పాట బయటకు వచ్చిననాటి నుంచి ఎన్నో పేరడీలు, మరెన్నో ఎడిటింగ్‌ వర్షన్లను రోజుకొకటి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సాంగ్‌లో సమంత స్టిల్‌ ఒకటి ఆ మధ్య బాగా వైరల్‌ అయింది. మీమ్స్‌లో బీభత్సంగా వాడే బ్రహ్మానందం స్టిల్‌ ఒకటి కూడా అచ్చం అలాగే ఉంటుంది.

దీంతో మీమ్స్‌రాయుళ్లు 'మా బ్రహ్మానందం స్టైల్‌ను కాపీ చేయొకండి సామ్‌.. అంటూ ఓ ఫన్నీ మీమ్‌ వదలగా అది సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. తాజాగా దీనిపై బ్రహ్మానందం స్పందించాడు. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సదరు మీమ్‌ను చూసి.. 'నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అలా అన్నాను. దానికి బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం' అని కౌంటరిచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement