రూత్‌లెస్‌...పవర్‌ఫుల్‌ | Sakshi
Sakshi News home page

రూత్‌లెస్‌...పవర్‌ఫుల్‌

Published Sun, Jan 28 2024 1:07 AM

Bobby Deol First Look Poster From Kanguva Movie - Sakshi

రూత్‌లెస్‌..పవర్‌ఫుల్‌..అన్‌ఫర్‌గెటబుల్‌... ఇవన్నీ ఒకరి గురించే. అతనే ఉధిరన్‌. ‘కంగువ’ సినిమాలో బాబీ డియోల్‌ పాత్ర పేరు ‘ఉధిరన్‌’. జనవరి 27 బాబీ డియోల్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కంగువ’ సినిమాలో ఆయన పోషిస్తున్న ఉధిరన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఫ్యాంటసీ ఫిల్మ్‌ ఇది. ఇందులో దిశా పటానీ హీరోయిన్‌గా, ఓ కీలక పాత్రలో బాబీ డియోల్‌ నటిస్తున్నారు.

కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ వరల్డ్‌ మూవీ పదికి పైగా భాషల్లో, త్రీడీలోనూ విడుదల కానుంది. ‘‘ఉధిరన్‌గా యునిక్‌ మేకోవర్‌లో కనిపిస్తారు బాబీ డియోల్‌. యుద్ధానికి సిద్ధం అవుతున్న ఉధిరన్‌కు ఆయన ప్రజలు మద్దుతు తెలుపుతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాబీ డియోల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్‌ శనివారం అధికారికంగా ప్రకటించింది.

Advertisement
 
Advertisement