హౌస్‌లో ఒక్క‌డైనా ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయిండా?.. నాగ్‌తోనే తేల్చుకుంటాన‌న్న తేజ‌ | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: అశ్వినితో లింకు పెట్టిన ప్రిన్స్‌.. మూడేళ్ల త‌ర్వాత పెళ్లి చేసుకుంటాన‌న్న గౌత‌మ్‌

Published Thu, Nov 2 2023 11:13 PM

Bigg Boss Telugu 7: Gautham Team Swap Bhole Shavali with Ambati Arjun - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండ‌ర్‌షిప్ టాస్క్ న‌డుస్తోంది. ఇందుకోసం ఇంటిని రెండు ముక్క‌లు చేశాడు బిగ్‌బాస్‌. ఆట‌లో కొట్లాట‌లు స‌హ‌జ‌మే.. బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాట‌ల మ‌ధ్య‌లో ఆట‌లు వ‌స్తూపోతూ ఉంటాయి.  అలా ఈ రోజు ర‌తిక‌-అమ‌ర్ గొడ‌వ‌ప‌డ్డారు. మ‌రి నేటి(న‌వంబ‌ర్ 2) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చదివేయండి..

ఏడ్చి సాధించింది.. కానీ ఏం లాభం?
కెప్టెన్సీ కంటెండ‌ర్‌షిప్ కోసం బిగ్‌బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఛాలెంజ్‌లు కూడా విసురుతున్నాడు. ఇక బాల్స్ టాస్క్‌లో ర‌తిక‌- అమ‌ర్‌దీప్ గొడ‌వ‌ప‌డ్డారు. ఒక‌రినొక‌రు తిట్టుకున్నారు. ఇంత‌లో బిగ్‌బాస్ బ్రేక్ ఫాస్ట్‌.. ఎయిమ్ లో అనే చాలెంజ్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో అమ‌ర్‌దీప్‌- అర్జున్ గెలిచారు. ఇక ఆడ‌తా.. ఆడ‌తానంటూ అలిగి సాధించి మ‌రీ గేమ్‌లో పాల్గొన్న శోభ ఓడిపోయింది. త‌న టీమ్‌లో ఎవ‌రైనా ఓడిపోతే నానామాట‌లు అనే శోభ తానే ఓడిపోవ‌డంతో క‌న్నీళ్లు పెట్టుకుంది. చాలెంజ్‌ గెలిచిన టీమ్‌కు బిగ్‌బాస్‌ రెండు ఆప్ష‌న్స్ ఇచ్చాడు.

వేలిముద్ర‌గాళ్లం అనుకుంటున్నారా?
అవ‌త‌లి టీమ్‌లో ఒక‌రిని ఆట‌లో నుంచి త‌ప్పిస్తారా? లేదంటే వారి ద‌గ్గ‌రి నుంచి 500 బాల్స్ తీసుకుంటారా? అని అడిగాడు. బాగా ఆలోచించిన శివాజీ టీమ్ అవ‌త‌లి టీమ్‌లో నుంచి 500 బాల్స్ తీసుకుంది. మ‌రోవైపు అశ్విని హౌస్‌మేట్స్‌పై ఉన్న కోపాన్నంతా భోలె ద‌గ్గ‌ర క‌క్కేసింది. ఇక్క‌డ అంద‌రూ ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. మ‌న‌మేమో ఎల్‌కేజీ కూడా చ‌దువుకోని వేలిముద్ర‌గాళ్లం అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఏం అనుకుంటున్నారో? ఏమో? ఒక్కొక్క‌డు ప‌దో త‌ర‌గ‌తి కూడా పాస్ అయిండో? లేదో? ఒక‌రిని జ‌డ్జ్ చేసే అధికారం వారికి ఎవ‌రిచ్చారు? ఒక ముగ్గురు అయితే ఎంత న‌వ్వుకుంటున్నారో.. అని చికాకు ప‌డింది.

గేమ్‌కు అడ్డుప‌డుతున్న శివాజీ
ఇంత‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. గోల్డెన్ బాల్ దొరికిన టీమ్‌.. అవ‌త‌లి టీమ్‌లో ఒక‌రితో స్వాప్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పాడు. దీంతో గౌత‌మ్ టీమ్ ఏకాభిప్రాయంతో త‌మ టీమ్‌లోని భోలె షావ‌లిని అవ‌త‌లి టీమ్‌లోకి పంపించి.. అందులో ఉన్న అర్జున్‌ను త‌మ టీమ్‌లోకి లాక్కుంది. రాత్రి శివాజీ టీమ్‌లోని బాల్స్ లాక్కుందామ‌ని ప్లాన్ వేసింది గౌత‌మ్ టీమ్‌. అయితే దొంగ‌త‌నం చేయ‌డానికి స‌సేమీరా కుద‌ర‌ద‌ని వాదించాడు శివాజీ. డాక్ట‌ర్ అయ్యుండి ఇలా ఎథిక్స్ లేకుండా మాట్లాడ‌తావా? అంటూ త‌న వృత్తిని మ‌ధ్య‌లోకి లాక్కొచ్చాడు. గౌత‌మ్ మీద ఫైర్ అయ్యాడు. దీంతో తేజ‌.. బాల్స్ దొంగ‌త‌నం చేయొచ్చా? లేదా? అనేది నాగార్జున స‌ర్‌నే అడిగి తేల్చుకుంటాన‌న్నాడు. 

గౌత‌మ్‌- అశ్విని పెళ్లి చేసుకోవ‌చ్చుగా
ఇక మ‌రుస‌టి రోజు అర్జున్‌.. అమ‌ర్ గురించి సెటైర్లు వేశాడు. వాడికి దూరంగా ఉందామంటే ప‌దేప‌దే అన్న‌య్యా అంటూ వ‌స్తున్నాడంటూ త‌ల ప‌ట్టుకున్నాడు. ఇంత‌లోనే బ‌జ‌ర్ మోగ‌డంతో మ‌ళ్లీ బాల్స్‌ గేమ్ మొద‌లైంది. అర్జున్ మీద ఎక్కి మ‌రీ బాల్స్ ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు అమ‌ర్‌. అటు ప్రిన్స్ యావ‌ర్ త‌న‌ టీష‌ర్ట్‌లో బాల్స్ దాచుకున్నాడు. త‌ర్వాత ప్రిన్స్‌.. అశ్విని-గౌత‌మ్‌ల‌కు లింకు పెడుతూ మాట్లాడాడు. గౌత‌మ్‌.. అశ్వినిని పెళ్లి చేసుకోవ‌చ్చుగా అని చెప్పాడు. అయితే మూడేళ్ల దాకా పెళ్లి చేసుకునే ఆలోచ‌నే లేద‌న్నాడు గౌత‌మ్‌. త‌ర్వాత‌ ప్ర‌శాంత్‌.. శోభ‌కు గోరుముద్ద‌లు తినిపించాడు.

చ‌ద‌వండి: ఆహ్వానం అందినా వ‌రుణ్‌- లావ‌ణ్య‌ల పెళ్లికి హాజ‌రు కాని జూనియ‌ర్ ఎన్టీఆర్‌!

Advertisement
 
Advertisement