బిగ్‌బాస్‌: ప్రశాంత్‌కు బంపరాఫర్‌ ఇచ్చిన శ్రీముఖి | Bigg Boss 7 Telugu Today Latest Promo: Sreemukhi Conducts Singing Auditions For Contestants, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Latest Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్‌

Published Sat, Dec 16 2023 12:09 PM

Bigg Boss Telugu 7: Contestants Singing Auditions With Sreemukhi - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అభిమానులు తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ఓట్లు గుద్దేశారు. అటు కంటెస్టెంట్లు ఫినాలే వరకు రావడానికి ఎంతో కష్టపడ్డారు. మొత్తానికి బిగ్‌బాస్‌ ఇంటా, బయటా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ యుద్ధం ముగిసింది.. కానీ ఇందులో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ ఫలితాల కోసం బిగ్‌బాస్‌ ప్రేమికులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. రేపు రాత్రి ఈ ఎదురుచూపులకు మోక్షం లభించనుంది.

ప్రశాంత్‌ ప్లీజ్‌.. ఇది ఫన్‌ టాస్క్‌
ఇకపోతే తాజాగా బిగ్‌బాస్‌ ఓ ప్రోమో రిలీజ్‌ చేశాడు. ఇందులో యాంకర్‌ శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. త్వరలో పాటల ప్రోగ్రామ్‌ మొదలుకాబోతోందని చెప్తూ కంటెస్టెంట్లను ఆడిషన్‌ చేసింది. అయితే ముందుజాగ్రత్తగా ప్రశాంత్‌ను హెచ్చరించింది. ప్రశాంత్‌, ప్లీజ్‌.. ఇది ఫన్‌ టాస్క్‌. ఓడిపోతే హగ్‌ ఇస్తా.. గెలిస్తే గట్టి హగ్‌ ఇస్తా కానీ ఏడవకు అని బంపరాఫర్‌ ఇచ్చింది. ఇంత మంచి ఆఫర్‌ ఇస్తే ఎందుకు వదులుకుంటానన్నట్లుగా తెగ మెలికలు తిరిగాడు రైతు బిడ్డ.

ట్రూత్‌ ఆర్‌ డేర్‌..
ఇక ఆడిషన్స్‌ మొదలవగానే అమర్‌దీప్‌ తనలోని బాత్రూమ్‌ సింగర్‌ను బయటకు తీశాడు. గోంగూర తోట కాడ కాపు కాశా.. అంటూ పాట మొదలుపెట్టాడు. కానీ మధ్యలోనే లిరిక్స్‌ మర్చిపోయాడు. తర్వాత అర్జున్‌ సరదాగా పాట పాడి నవ్వించేశాడు. కంటెస్టెంట్లతో ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ ఆడించింది శ్రీముఖి. ముగ్గురు లేడీ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడగ్గా ప్రిన్స్‌ యావర్‌ క్షణం ఆలోచించకుండా అశ్విని పేరు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అతడిని ఆటపట్టించారు.

చదవండి: విడాకుల రూమర్స్‌.. భర్త, మామతో ఐశ్వర్య డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement