బిగ్‌బాస్‌: ప్రియ పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా? | Bigg Boss Telugu 5: Priya Remuneration For BB5 Telugu | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ ద్వారా భారీగా లాభపడ్డ ప్రియ!

Oct 25 2021 9:02 PM | Updated on Oct 30 2021 11:29 PM

Bigg Boss Telugu 5: Priya Remuneration For BB5 Telugu - Sakshi

Priya Remuneration For Priya: అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియ వారానికి ఎంత తీసుకుంది? ఏడు వారాల్లో ఎన్ని లక్షలు పోగు చేసింది? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.

Bigg Boss 5 Telugu, Eliminated Contestant Priya Remuneration: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న సీనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రియ ఏడు వారాలకే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియ వారానికి ఎంత తీసుకుంది? ఏడు వారాల్లో ఎన్ని లక్షలు పోగు చేసింది? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ నటికి ఒక్క వారానికే 1.5  లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు పది లక్షల పైనే సంపాదించినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇంత మొత్తాన్ని ఫిక్స్‌ చేసినట్లు కనిపిస్తోంది. అయితే షోలో ఆమె చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్‌ చేసుకుని వీళ్లు ముందుగా అనుకున్న డీల్‌ కంటే మరింత ఎక్కువే ఇచ్చే ఆస్కారమూ లేకపోలేదు. ఇక బిగ్‌బాస్‌ కోసం తన ప్రాజెక్టులను పక్కన పెట్టి మరీ వచ్చినందుకు ఆమాత్రం ఇవ్వడంతో తప్పు లేదంటున్నారు ప్రియ అభిమానులు. అంతేకాకుండా టీఆర్పీకి అవసరమయ్యే కంటెంట్‌ కూడా ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement