బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! నిజ‌మెంత‌? | Bigg Boss Telugu 5: Preethi Anshu Wild Card Entry Is Not Real | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: అందాల భామ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! నిజ‌మేనా?

Oct 16 2021 8:34 PM | Updated on Oct 16 2021 10:21 PM

Bigg Boss Telugu 5: Preethi Anshu Wild Card Entry Is Not Real - Sakshi

ప్రీతి అన్షు బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ సోష‌ల్ మీడియ‌లో ప్ర‌చారం ఊపందుకుంది. దీంతో ప్రీతి అన్షు ఎవ‌రా?...

Bigg Boss 5 Tlugu, Wild Card Entry: బిగ్‌బాస్ షోలో ఫేక్ ఎలిమినేష‌న్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు స‌ర్వసాధార‌ణ‌మే! కాక‌పోతే అదును చూసి వాటిని రంగంలోకి దింపుతాడు బిగ్‌బాస్‌. గ‌త సీజ‌న్ల‌లో దీక్షాసేత్‌, పూజా, కుమార్ సాయి, ముక్కు అవినాష్‌, స్వాతి దీక్షిత్‌.. ఇలా కొంత‌మంది వైల్డ్‌కార్డ్ ద్వారా షోలో పాల్గొన్నారు. అయితే ఈసారి లాంచింగ్ ఎపిసోడ్‌లోనే అత్య‌ధికంగా 19 మంది కంటెస్టెంట్ల‌ను హౌస్‌లోకి పంపించారు. దీంతో ఈసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉంటుందా? లేదా? అని సోష‌ల్ మీడియాలో అనేక‌సార్లు చ‌ర్చ జ‌రిగింది. మెజారిటీ నెటిజ‌న్లు ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అభిప్రాయ‌ప‌డ్డారు. 19 మందితో బిగ్‌బాస్‌ హౌస్‌ఫుల్ అయింద‌ని, కొత్త‌గా ఎవ‌రినీ పంపించ‌క‌పోవ‌చ్చ‌ని అనుకున్నారు. కానీ ఆ మ‌ధ్య యాంక‌ర్ వ‌ర్షిణి, విష్ణుప్రియ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. కానీ అందులో ఇసుమంతైనా నిజం లేద‌ని తేట‌తెల్ల‌మ‌వ‌డంతో నిట్టూర్పు విడిచారు జ‌నాలు. తాజాగా మ‌రో భామ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రీతి అన్షు బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ సోష‌ల్ మీడియ‌లో ప్ర‌చారం ఊపందుకుంది. దీంతో ఆమె ఎవ‌రా? అని నెట్టింట గాలింపు మొద‌లు పెట్టింది యూత్‌. ప్రీతి అన్షు ఒక మోడ‌ల్‌. మై దిల్ అనే షార్ట్ ఫిలింలోనూ న‌టించింది. న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఆశ‌ప‌డుతోంది. అయితే పెద్ద‌గా గుర్తింపు లేని ఆమెకు బిగ్‌బాస్ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మొద‌ట‌గా ఆమె హౌస్‌లో అడుగు పెట్ట‌బోతుంద‌ని చెప్పిన లీకువీరులే.. అబ్బే, అదంతా తూచ్‌, వైల్డ్‌కార్డ్ ద్వారా ఆమె బిగ్‌బాస్ షోకి వెళ్ల‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా ప్ర‌స్తుతం ఈ ప్రీతి అన్షు పేరు మాత్రం నెట్టంట మార్మోగిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement