Bigg Boss 5 Telugu: త‌ప్పు చేస్తే క్ష‌మించండంటూ లోబో వీడ్కోలు, మ‌ళ్లీ వారానికే రీఎంట్రీ!

Bigg Boss Telugu 5: Eliminated Contestant Lobo Went To Secret Room - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 42: వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా ఎంపికై జైల్లో బందీ అయిన శ్వేత శిక్ష పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌లో ర‌వి ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. నా ఐడియా ఫాలో అవ‌మ‌ని నీకు చెప్ప‌లేద‌ని పేర్కొన్నాడు. కానీ శ్వేత మాత్రం.. నువ్వు  కుష‌న్స్ క‌ట్ చేయ‌మ‌ని నాకు కూడా చెప్పావ‌ని తెలిపింది. త‌ర్వాత ఇంటిస‌భ్యులు వారికి పంపించిన కాస్ట్యూమ్స్ వేసుకుని రెడ్ కార్పెట్‌పై హొయ‌లొలికిస్తూ న‌డిచారు. అనంత‌రం కాజ‌ల్‌, ర‌వి ఫ్రెండ్‌షిప్ హ‌గ్గిచ్చుకుని క‌లిసిపోయారు.

ర‌వి గ‌డ్డి తిన‌మంటే తింటావా?
ఇక నాగార్జున వ‌చ్చీరావ‌డంతోనే కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్కులో కుష‌న్స్ పాడు చేసింది ఎవ‌ర‌ని గ‌ర‌మ‌య్యాడు. దీంతో లోబో నీళ్లు న‌ములుతూ మొద‌ట త‌నే దూది తీశాన‌ని తెలిపాడు. హౌస్ ప్రాప‌ర్టీ ధ్వంసం చేయ‌కూడ‌ద‌ని తెలీదా? అని నాగ్‌ నిల‌దీయ‌గా అమాయ‌కంగా ముఖం పెట్టి తెలీదంటూ అడ్డంగా త‌లూపాడు లోబో. కుష‌న్స్ క‌ట్ చేయ‌మ‌ని నీకు ర‌వి చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోయావు, ర‌వి గ‌డ్డి తిన‌మంటే తింటావా? అని ఫైర్ అయ్యాడు.

యాక్ట‌ర్స్ అంటే చిన్న‌చూపా?
సంచాల‌కులుగా ఉన్న‌ప్పుడు కంటెస్టెంట్లు చెప్పేది కూడా వినాల‌ని సిరికి స‌ల‌హా ఇచ్చాడు నాగ్‌. ఇక యానీ అంత గ‌ట్టిగా అర‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని, అంద‌రి మీదా ఒట్టేయాల్సిన ప‌ని లేద‌ని చుర‌క‌లంటించాడు. అయితే సిరి యాటిట్యూడ్ న‌చ్చ‌కే అలా ప్ర‌వ‌ర్తించాన‌నింటూ ఆమెకు సారీ చెప్పింది యానీ. ఇక‌ నువ్వు నీలా ఉంటేనే అంద‌రికీ న‌చ్చుతావ‌ని శ్రీరామ్‌కు సూచించాడు నాగ్‌. అయితే నామినేష‌న్స్‌లో అంత‌ దురుసుగా మాట్లాడావు, యాక్ట‌ర్స్ అంటే చిన్న‌చూపా? అని నిల‌దీశాడు. దీంతో త‌ప్పు అంగీక‌రించిన‌ శ్రీరామ్ త‌ల దించుకుని సారీ చెప్పాడు. స‌న్నీకి ఎక్క‌డ‌లేని ఎన‌ర్జీ వ‌చ్చింద‌న్న నాగ్ ఇదే ఆట‌ను కంటిన్యూ చేయ‌మ‌ని చెప్పాడు. అంద‌రూ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నా నువ్వు మాత్రం అవ్వ‌డం లేద‌ని ష‌ణ్నుని మెచ్చుకున్నాడు నాగ్‌.

మ‌రోసారి అడ్డంగా దొరికిపోయిన ర‌వి
ఇక శ్వేత‌.. త‌ను రెండుసార్లు కుష‌న్స్ క‌ట్ చేశాన‌ని చెప్తూ బోరుమ‌ని ఏడ్చేసింది. ఆ ఐడియా ఇచ్చిన మ‌నిషి మాత్రం చేయ‌లేదంటూ ర‌వి మీద కౌంట‌రేశాడు నాగ్‌. ఇదంతా చూస్తుంటే న‌ట‌రాజ్ చెప్పిందే క‌రెక్ట్(గుంట‌న‌క్క‌) అనిపిస్తోంద‌ని ర‌విని ఘోరంగా అవ‌మానించాడు. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ ర‌వి.. లోబో, నేను మాత్ర‌మే ఈ ఐడియా డిస్క‌ష‌న్ చేశామ‌న్నాడు. బిగ్‌బాస్ పంపిన కాట‌న్‌, కుష‌న్స్‌లో ఉన్న దూది సేమ్ ఉన్నాయ‌న్నాడు. దీంతో సంచాల‌కులు ఆ రెండుర‌కాల దూదిల‌ను ప‌రీక్షించి అవి ఒకేలా లేవ‌ని చెప్పడంతో మ‌రోసారి ర‌వి అడ్డంగా దొరికిపోయాడు. ఇక శ్వేత తీసింద‌ని త‌న‌కు తెలీద‌ని ర‌వి ప‌దేప‌దే చెప్ప‌డంతో మ‌ధ్య‌లోనే అడ్డుప‌డ్డ శ్వేత‌.. ర‌వికి ఈ విష‌యం ముందే తెలుసంటూ అంద‌రి ముందే క్లారిటీ ఇచ్చింది.

ర‌వి ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ప‌క్క‌వారి గేమ్ చెడ‌గొడుతున్నాడు
త‌ర్వాత నాగ్‌ ఇంటిస‌భ్యుల‌ను ఒక్కొక్క‌రిగా క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి హౌస్‌లో ఉండేందుకు అర్హ‌త లేని వాళ్ల పేర్ల‌ను చెప్ప‌మ‌న్నాడు. ముందుగా మాన‌స్‌.. వేరేవాళ్ల మాట‌ల‌ను ప‌ట్టించుకుంటూ శ్రీరామ్ అన్నింటా వెన‌క‌డుగు వేస్తున్నాడ‌న్నాడు. స‌న్నీ మాట్లాడుతూ.. టాస్కుల్లో 100% ఇవ్వ‌డం లేదంటూ ప్రియ పేరు చెప్పాడు. కాజ‌ల్‌.. ఇద్ద‌రికి అర్హ‌త లేద‌నిపిస్తూనే ప్రియ పేరు చెప్పింది. ఆమె క‌నిపించేంత స్వీట్‌గా ఉండ‌ర‌ని పేర్కొంది. యానీ మాస్ట‌ర్‌, శ్వేత‌, సిరి, ష‌ణ్ముఖ్‌.. సొంతంగా ఆడ‌లేక‌పోతున్నాడంటూ లోబో పేరు సూచించారు. శ్రీరామ్‌.. రవి పేరు చెప్పాడు. ప్రియ‌, ప్రియాంక‌.. ఎవ‌రికి గొడ‌వ‌ల‌వుతాయా అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండే కాజ‌ల్ అన్‌ఫిట్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. జెస్సీ.. ప‌క్క‌వాళ్లను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ వారి గేమ్ చెడ‌గొడుతున్న ర‌వి వెళ్లిపోవాల‌ని కోరుకున్నాడు.

తెలీక త‌ప్పు చేస్తే క్షమించండంటూ లోబో వీడ్కోలు
ర‌వి.. అక్క‌డి విష‌యాలు ఇక్క‌డ, ఇక్క‌డ విష‌యాలు అక్క‌డ చెప్తున్న కాజ‌ల్ హౌస్‌లో అన‌ర్హురాలు అని చెప్పాడు. విశ్వ‌.. త‌ప్పు చేస్తే ఒప్పుకోకుండా, స‌మ‌ర్థించుకునే ప్రియ అన్‌ఫిట్ అని అభిప్రాయ‌ప‌డ్డాడు. చివ‌ర‌గా వ‌చ్చిన లోబో.. ప్రియ బిగ్‌బాస్ హౌస్‌కు అన‌ర్హురాలు అని పేర్కొన్నాడు. మొత్తంగా ఈ ప్ర‌క్రియ‌లో లోబోకు, ప్రియ‌కు స‌మానంగా 4 ఓట్లు ప‌డ‌టంతో నాగ్ ఓ ప‌రీక్ష పెట్టాడు. హౌస్‌మేట్స్ ఎవ‌రికి ఎక్కువ స‌పోర్ట్ చేస్తే వారు సేఫ్ అని చెప్పాడు. ర‌వి, స‌న్నీ, విశ్వ.. ఈ ముగ్గురు మాత్ర‌మే లోబో వైపు నిల‌బ‌డ‌గా మిగిలిన అంద‌రూ ప్రియ‌కు మ‌ద్ద‌తిచ్చారు. దీంతో లోబో ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించ‌డంతో ర‌వి షాకయ్యాడు. ఇక‌ విశ్వ అయితే చిన్న‌పిల్లాడిలా గుక్క పెట్టి మ‌రీ ఏడ్చాడు. తెలీక త‌ప్పు చేస్తే క్షమించండంటూ ఏడుస్తూ వీడ్కోలు తీసుకున్నాడు.

వారం రోజుల‌పాటు సీక్రెట్ రూమ్‌లో!
స్టేజీ మీద‌కు వ‌చ్చిన లోబోతో నాగ్ థంబ్స్ అప్‌, థంబ్స్ డౌన్ ఆడించాడు. స‌న్నీ బుర్ర‌, త‌న బుర్ర ఒక‌టేన‌న్న లోబో ఇక‌పై మారిపోమ‌ని సూచించాడు. కాజ‌ల్‌కు ఏ వేలూ చూపించ‌లేదని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు. కంటెస్టెంట్లు అంద‌రికీ థంబ్స్ అప్ చూపించాడు. త‌ర్వాత‌ అత‌డిని పంపించిన‌ట్లే పంపించేసి తిరిగి ర‌మ్మ‌న్నాడు నాగ్‌. నిన్ను ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ఉంద‌ని చెప్ప‌డంతో లోబో నేల‌పై మోక‌రిల్లి ఏడ్చాడు.  మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాల‌ని ఓటేసినందున‌ వ‌చ్చేవారం నేరుగా నామినేష‌న్స్‌లో ఉండ‌బోతున్నావ‌ని చెప్పాడు. కాక‌పోతే నువ్వు హౌస్‌లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నావ‌ని వెల్ల‌డించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top