Bigg Boss 6: ‘బిగ్‌బాస్‌’లో చేపల లొల్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ

Bigg Boss 6 Telugu: Geetu Rayal Emotional,Episode 52 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం మొదలైన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు హౌస్‌మేట్స్‌కి ‘చేపల చెరువు’ అనే టాస్క్ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీని కోసం ఇంటి సభ్యులను జంటలుగా విడదీశాడు.  సూర్య- వసంతి, రేవంత్- ఇనయ, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా,  ఆదిరెడ్డి -గీతు, రోహిత్ -కీర్తి, రాజ్- పైమా జంటలుగా విడిపోయి, గార్డెన్‌ ఏరియాలో కురిసే చేపల వర్షంలో చేపలను పట్టుకోవాలి. టాస్క్‌ మధ్యలో బిగ్‌బాస్‌ అడిగినప్పుడు ఏ జంట దగ్గర తక్కువ చేపలు ఉంటాయో.. ఆ జంట ఈ టాస్క్‌ నుంచి తప్పుకుంటుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్‌ ఇచ్చే చాలెంజ్‌లు గెలిచిన జంట తమ చేపల సంఖ్యను పెంచుకోవచ్చు.

చాలెంజ్‌లో పోటీపడేందుకు హారన్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి ప్రతి జంట నుంచి ఒకరు దిగి గొల్డ్‌ కాయిన్‌ని వెతకాల్సి ఉంటుంది. గోల్డ్‌ కాయిన్‌ దొరికిన జంట చాలెంజ్‌లో పాల్గొనడమే కాకుండా.. తమతో ఎవరు పోటీ పడొచ్చో కూడా ఎంచుకునే అవకాశం ఉంది.  ఇక టాస్క్‌లో ఫిజికల్‌గా గెలవలేమని భావించిన గీతూ, ఆదిరెడ్డి.. మాటలతో ఆటలో చిచ్చు పెట్టాలని ప్లాన్‌ వేసింది. రేవంత్‌ని మాటలతో రెచ్చగొట్టి ఆపితే..ఇనయా ఎక్కువగా చేపలు ఏరలేదని ఆదిరెడ్డికి ముందే చెప్పింది. అయితే గీతూ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు.

చేపల వర్షం పడినప్పుడు అందరూ పోటీపడి మరి చేపలను ఏరుకున్నారు. ఇక తక్కువ చేపలు ఏరుకున్న గీతూ.. వాసంతి బుట్ట నుంచి చేపలను దొంగిలించేందుకు ప్రయత్నించింది. కానీ సూర్య అడ్డుకున్నాడు. దీంతో మెరినాను టార్గెట్‌ చేసింది. అయితే బాలాదిత్యతో పాటు రోహిత్‌ కూడా గీతూని అడ్డుకున్నారు. దీంతో రోహిత్‌, మెరినా కలిసి ఆడుతున్నారని, నిజం ఒప్పుకోవడానికి నాలాగా గట్స్‌ ఉండాలంటూ రెచ్చగొట్టింది. ‘నువ్వు నా జోలికి రావొద్దు’అంటూ మెరీనా గీతూపై ఫైర్‌ అయింది. తాను అందరిని టార్గెట్‌ చేస్తానని, ప్రతి ఒక్కరి బుట్టలో నుంచి చెపలు దొంగిలిస్తానని చెప్పింది.

ఈ గొడవల మధ్యే హారన్‌ మోగింది. దీంతో ప్రతి జంట నుంచి ఒక్కొక్కరు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన స్మిమింగ్‌ఫూల్‌లోకి వెళ్లారు. అయితే అనూహ్యంగా గోల్డ్‌ కాయిన్‌ రేవంత్‌కి దొరికింది. అనంతరం బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు చేపలను లెక్కించగా.. గీతూ, ఆదిరెడ్డి జంట దగ్గర తక్కువ సంఖ్యలో చేపలు లభించడంతో టాస్క్‌ నుంచి తప్పుకుంది. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ‘ఫుష్ ఫర్ ఫిష్ ’లో రేవంత్‌తో పోటీపడేందుకు రాజ్‌-ఫైమా, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా బరిలోకి దిగారు. ఈ చాలెంజ్‌లో రాజ్‌-ఫైమా జంట విజేతగా నిలిచి 10 చేపలను దక్కించుకుంది.

హారన్‌ మోగినప్పుడు మైక్‌ ధరించి స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దిగిన కారణంగా శ్రీసత్య, సూర్య జంటల నుంచి 10 చేపలను వెనక్కి తీసుకున్నాడు బిగ్‌బాస్‌.  టాస్క్‌ సమయం ముగిసేసరికి రేవంత్‌-ఇనయా జంట దగ్గర అత్యధిక చేపలు ఉన్నాయి. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి తప్పుకోవడంతో గీతూ వెక్కివెక్కి ఏడ్చింది. టాస్క్‌ కోసమే అందరిని రెచ్చగొట్టానని హౌస్‌మేట్స్‌కి చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. టాస్‌లో తనను నెట్టేసిన రేవంత్‌ని కాలితో తన్నడంతో పాటు బూతు పదాన్ని వాడానని, అందుకు క్షమాపణ కోరుతున్నానని చెప్పింది. రేవంత్‌ కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదని, అనుకోకుండా నెట్టేశానని చెప్పింది. మరి ‘చేపల చెరుపు’టాస్క్‌లో చివరకు ఎవరు గెలిచి కెప్టెన్స్‌ అవుతారో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-01-2023
Jan 04, 2023, 13:46 IST
ఫస్ట్‌ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌కు 14.13, రెండో సీజన్‌ ఫినాలేకు 15.05, మూడో సీజన్‌ ఫినాలేకు 18.29, నాలుగో...
30-12-2022
Dec 30, 2022, 12:07 IST
బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ సూపర్‌ హిట్‌...
27-12-2022
Dec 27, 2022, 14:05 IST
బిగ్‌బాస్‌ షోలో లేడీ టైగర్‌గా పాపులర్‌ అయిన కంటెస్టెంట్‌ ఇనాయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్‌ లైన్‌తో హౌస్‌లోకి...
22-12-2022
Dec 22, 2022, 21:34 IST
 విశ్వ కొబ్బరి నీళ్లు తాగి తీయగానే ఉన్నాయిగా, ఏమైనా ప్రాంక్‌ చేస్తున్నావా? అని అడిగాడు. తర్వాత చాక్లెట్‌ కావాలని అడిగడంతో...
22-12-2022
Dec 22, 2022, 15:41 IST
మెటర్నటీ ఫోటోషూట్‌ చేయించుకోగా అందుకు సంబంధించిన ఫోటోలను దంపతులు వారి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 
21-12-2022
Dec 21, 2022, 18:07 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది కీర్తి. డబ్బులు ఎర చూపినా సరే వద్దంటూ అభిమానులు తనను...
19-12-2022
Dec 19, 2022, 18:11 IST
అమ్మ సూసైడ్‌ చేసుకుని చనిపోయింది. అప్పటికే బ్యాంకులో తీసుకున్న రూ.11 లక్షల లోన్‌ కట్టలేకపోయాం.
19-12-2022
Dec 19, 2022, 14:59 IST
ఒక సినిమాకు స్టార్‌ హీరోయిన్‌ అందుకునే పారితోషికం.. తన నెల సంపాదనతో సమానం అని ఆదిరెడ్డే స్వయంగా చెప్పా..
19-12-2022
Dec 19, 2022, 13:50 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ విన్నర్‌గా రేవంత్ నిలిచారు. రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు.  ఈ గ్రాండ్‌ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో...
19-12-2022
Dec 19, 2022, 12:24 IST
ఈ గ్రాండ్‌ ఫినాలే వీరిద్దరికే కాదు నేహా చౌదరికి కూడా జీవితాంతం గుర్తుండిపోనుంది. కారణం.. అదే రోజు రాత్రి ఆమె పెళ్లి...
19-12-2022
Dec 19, 2022, 11:32 IST
బిగ్‌బాస్‌ 6 తెలుగు సీజన్‌కు ఎండ్‌ కార్డ్‌ పడింది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్‌...
18-12-2022
Dec 18, 2022, 23:15 IST
హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్‌ అయిన ఘనత కూడా ఇతగాడి పేరు మీదుంది. స్నేహానికి ఎంత విలువిస్తాడో ప్రత్యక్షంగా చూశాం....
18-12-2022
Dec 18, 2022, 22:36 IST
అదే సమయంలో ట్రోఫీ నాదే అని షో మొదటి రోజు నుంచే కలలు కంటున్న రేవంత్‌ ముఖం వాడిపోయింది.
18-12-2022
Dec 18, 2022, 22:01 IST
నాగార్జున గోల్డెన్‌ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను...
18-12-2022
Dec 18, 2022, 21:11 IST
'కీర్తి బిగ్‌బాస్‌ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత...
18-12-2022
Dec 18, 2022, 19:48 IST
శ్రీహాన్‌.. బెస్ట్‌ లవర్‌ బాయ్‌ అవార్డుకు అర్జున్‌ కల్యాణ్‌ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అవార్డు అందుకున్నాడు.
18-12-2022
Dec 18, 2022, 18:42 IST
విధి ఆడిన వింత నాటకంలో బలిపశువు అయిపోయానని నేహా అనగానే బలిపశువు అయ్యేది నువ్వా? అతడా? అని నాగ్‌ కౌంటరిచ్చాడు ...
18-12-2022
Dec 18, 2022, 15:33 IST
 మాస్‌ మహారాజకు బ్రీఫ్‌కేస్‌ ఇచ్చి హౌస్‌ లోపలకు పంపించారు. కానీ ఫైనలిస్టులు ఎవరూ దాన్ని అందుకోవడానికి రెడీగా లేనట్లు కనిపించింది....
17-12-2022
Dec 17, 2022, 23:08 IST
శ్రీహాన్‌ జెన్యూన్‌ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ...
17-12-2022
Dec 17, 2022, 16:48 IST
గెలుపును తీసుకుంటావు, కానీ ఓటమిని తీసుకోలేవని రేవంత్‌ను తప్పుపట్టిన నువ్వు ఓసారి ప్లేటు తీసి విసిరికొట్టావని గుర్తు చేశాడు. దీనికామె నేను...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top