బిగ్‌బాస్‌: నా పాయింట్‌లో ఇదే కరెక్ట్‌, నేను అలానే చేస్తా.. పింకీపై షణ్ముఖ్‌ ఫైర్‌

Bigg Boss 5 Telugu: Shanmukh Fires On Priyanka - Sakshi

Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు కంటెస్టెంట్స్‌ భయంలో వణికిపోతారు. ఆ రోజు నామినేషన్స్‌ ఉండడమే ఆ భయానికి కారణం. ఆ గండం నుంచి బయటపడేందుకు ఇంటిసభ్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే పదోవారంలో చిన్నపాటి ట్విస్ట్‌తో నామినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్‌బాస్‌. డైరెక్ట్‌గా నలుగురిని నామినేట్‌ చేసే అవకాశాన్ని కెప్టెన్‌ యానీ మాస్టర్‌కు కల్పించాడు.

అంతేకాదు ఆ నలుగురిని జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు. దీంతో యానీ మాస్టర్‌.. మానస్‌, కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్‌ చేసి జైలులో పెట్టింది. అయితే వారికి నామినేషన్స్‌ తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చాడు.  బజర్‌ మోగిన వెంటనే లివింగ్‌ రూమ్‌లో ఉన్న తాళాలను ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లు.. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని జైలు నుంచి బయటకు తీసుకురావొచ్చని మిగిలిన ఇంటి సభ్యులకు సూచించాడు. 

ఇందులో భాగంగా ప్రియాంక తాళం దక్కించుకొని మానస్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్‌.. జెస్సీ,రవిలను నామినేట్‌ చేశాడు. సిరి తాళం దక్కించుకొని షణ్ముఖ్‌ను కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. జెస్సీ వల్ల షణ్ముఖ్‌ బయటపడ్డాడు. తనకు ఒకరిని నామినేట్‌ చేసే చాన్స్‌ రావడంతో.. పింకీని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేస్తున్నానని చెప్పాడు. దీంతో బాగా హర్ట్‌ అయిన పిం‍కీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్‌ లేదని నన్ను నామినేట్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. నా పాయింట్‌లో నువ్వు కరెక్ట్‌ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్‌ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్‌లో ఇదే కరెక్ట్‌.. నేను ఇలానే నామినేట్‌ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top