Bigg Boss 5 Telugu: యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా! అదే ఆమె కొంపముంచిదా?

Bigg Boss 5 Telugu: Reasons Behind Anne Master Elimination From Bigg Boss House - Sakshi

Reasons Behind Anne Master Eliminations From Bigg Boss Telugu 5 Show: తాజా బిగ్‌బాస్‌ 5 నుంచి యానీ మాస్టర్‌ బయటకు వచ్చింది. 11వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా యానీ మాస్టర్‌ హౌజ్‌ను వీడక తప్పలేదు. చివరి వరకు ప్రియాంక, యానీ మాస్టర్ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో ప్రియాంక సేవ్ అయిపోవడంతో యానీ ఇంటిముఖం పట్టక తప్పలేదు. చెప్పాలంటే వీరిద్దరిలో యానీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్. సొంతంగా తన కోసం ఆట ఆడింది. ప్రియాంక సింగ్ మాత్రం తనకంటే ఎక్కువగా మానస్‌పై ఫోకస్‌ పెడుతూ తన గేమ్‌ను పక్కన పెట్టింది.

ఎమన్నా అంటే మానస మానస్‌ అంటూ జపం చేస్తూ తనకోసం గేమ్‌ ఆడటమే మరిచిపోయింది.ఈ విషయంలో ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది. అయినా కూడా తన ఆటతీరు మార్చుకోవడం లేదు. ఏ విషయంలో చూసిన ప్రియాంక కంటే యానీయే స్ట్రాంగ్‌. కానీ ఆమె ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలు ఇవే అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. కాగా దీనికి ప్రధాన కారణం ఆమె నోటి దురుసు. ఏ విషయంలోనైనా తను చాలా పర్‌ఫెక్ట్‌ అనే అతి నమ్మకంతో ఉండటం కూడా ఒక కారణం.

హౌజ్‌లో తనకు ఏమైన అవసరం ఉంటే చాలా నెమ్మదిగా మాట్లాడే యానీ.. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారితే మాత్రం నోరు చించుకుంటు అందరి మీద అరుస్తుంది.‘గేమ్‌లో తేడా వస్తే చాలు హౌజ్‌లో నేను ఒక్కదానినే నిజాయితిగా ఆడాను అందరూ గ్రూపులుగా ఆడుతున్నారు’ ఏడుపు మొదలు పెడుతుంది. అదే యానీ కొంప ముంచింది అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఎప్పుడో ఎలిమినేట్‌ అవ్వాల్సిన ఆమె నామినేషన్‌ నుంచి తప్పుకోవడం వల్లే ఇంతకాలం హౌజ్‌లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వారం యానీ నామినేషన్‌లో రావడం, ఎప్పుటి కంటే కూడా ఈవారం ఆమె కాస్తా ఎక్కువగా నోటి దురుసు ప్రదర్శించడంతో ప్రేక్షకుల్లో ఆమెపై నెగిటివిటి పెరిగిందంటున్నారు.

ఇక అంతకంటే సహా కంటెస్టెంట్‌ కాజల్‌ను ఎప్పుడ తప్పుబట్టడం, తన గురించి మిగతా కంటెస్టెంట్స్‌ వద్ద తప్పుగా మాట్లాడటం కూడా ప్రధాన కారణం అంటున్నారు. అప్పటి వరకు ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఫైర్ టాస్క్‌లో అనీ మాస్టర్ చేసిన రచ్చతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కంటెస్టెంట్స్ అందరిపై ఆనీ మాస్టర్ నోరు పారేసుకోవడం.. చాలా ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతుండటంతో ప్రేక్షకులు ఇంటి నుంచి ఈమెను బయటికి పంపించేశారు. కచ్చితంగా వచ్చేవారం ప్రియాంక బయటికి రావడం ఖాయం అనే ప్రచారం ఇప్పటి నుంచే మొదలైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top