Bigg Boss 5 Telugu Contestant Nataraj Master & Neethu Blessed With Baby Girl - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన నటరాజ్ మాస్టర్ భార్య

Nov 18 2021 8:57 AM | Updated on Nov 18 2021 9:23 AM

Bigg Boss 5 Telugu: Nataraj Master Wife Neetu Blessed With Baby Girl - Sakshi

Bigg Boss 5 Telugu Contestant Nataraj Master & Neethu Blessed With Baby Girl: కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ భార్య నీతూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నటరాజ్‌ మాస్టర్‌ కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ నటరాజ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తనకు అమ్మాయియే కావాలని కోరుకున్నానని, అనుకున్నట్లే పాప పుట్టిందని మురిసిపోయాడు. బుధవారం అర్థరాత్రి లోబోతో కలిసి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన నటరాజ్‌.. అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పారు. తనకు, తన బిడ్డకు అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నారు. దేవుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమి ఇవ్వకున్నా.. బయట పండండి బిడ్డని ఇచ్చారంటూ ఎమోషనల్‌ అయ్యారు.

కాగా, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నటరాజ్‌ మాస్టర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు. తొలుత వెళ్లొద్దని భావించినా.. భార్య కోరిక మేరకు తాను బిగ్‌బాస్‌ షోకి వచ్చానని నటరాజ్‌ మాస్టర్‌ చెప్పారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు తన భార్య గురించే ఆలోచించాడు. పుట్టబోయే బిడ్డను నా చేతుల్తో ఎత్తుకుంటానో లేదో అని బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా ఐదో వారానికే ఆయన బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండడం, అనుకున్నట్లే ఆడపిల్ల పుట్టడంతో నటరాజ్ మాస్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement