Bigg Boss 5 Telugu: హమిదా పంచ్‌కి నాగ్‌ షాక్‌!

Bigg Boss 5 Telugu: Hamida Funny Counter To Nagarjuna - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో సండే అంటే ఫన్‌డే అన్న విషయం తెలిసిందే. నిన్న అంత హౌస్‌మేట్స్‌ అందరిపై సీరియస్‌ అయిన హోస్ట్‌ నాగ్‌.. ఈ రోజు వారితో చాలా సరదాగా ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఆదివారం మాదిరే ఈ వారం కూడా కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్‌ ఆడించాడు. 
(చదవండి: బిగ్‌బాస్‌: ప్రియ సేఫ్‌, లహరి ఎలిమినేట్‌!)

అయితే ఈ రోజు కంటె​స్టెంట్స్‌తో నాగ్‌ హోస్ట్‌గా కాకుండా ఓ ఫ్రెండ్‌లా వ్యవహరించాడు. హమిదాను చూస్తూ యూ లుకింగ్‌ హాట్‌ బేబీ అని నాగ్‌ అంటే.. టెల్‌ మి సమ్‌థింగ్‌ న్యూ(కొత్తది ఏదైనా ఉంటే చెప్పండి)అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది హమిదా. దీంతో నాగ్‌ షాకయ్యాడు. ఇక సిరి హన్మంత్‌ కూడా నేనేమి తక్కువ కాదనట్లుగా పంచ్‌లతో అదరగొట్టేసింది. ఈ బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ విడివిడి ఉండడం నచ్చడంలేదని నాగ్‌ అంటే.. మాక్కూడా ఇష్టంలేదు అంటూ సిరి సెటైర్‌ వేసింది. సన్నీతో పాట కూడా పాడించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top