Bigg Boss Telugu 5: హమీదా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss Telugu 5, Hamida Remuneration: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా కుర్రకారు మనసు దోచేసింది హమీదా. చిలిపి నవ్వుతో, చురకత్తుల్లాంటి ఆలోచనలతో, తస్సాదియ్య అనిపించే ఆటతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే ఈ భామ ఐదు వారాలకే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలో సరైన ఫ్యాన్‌బేస్ లేకపోవడంతోనే ఆమె ఓటింగ్‌లో వెనకబడిపోయిందంటున్నారు నెటిజన్లు. శ్రీరామ్‌తో నడుపుతున్న లవ్ ట్రాక్‌తో ఆమెకు కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరికినప్పటికీ అందరికన్నా తక్కువ ఓట్లు పడటంతో ఎలిమినేట్ అవక తప్పలేదు.
ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందర్భంగా హమీదా పారితోషికం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఒక్క వారానికిగానూ 80 వేల నుంచి లక్ష రూపాయల మేర రెమ్యునరేషన్ అందుకున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ లెక్కన ఆమె ఐదువారాలకుగానూ నాలుగున్నర లక్షల పై చిలుకే వెనకేసుకుంది. కాగా గతవారం ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ కూడా వారానికి లక్ష అందుకున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే! ఇక బిగ్‌బాస్ హౌస్‌కు గ్లామర్ అద్దడానికి హమీదా ఎంతగానో ఉపయోగపడింది కాబట్టి ఆమెకు లక్షకు పైనే ఇచ్చినా తప్పు లేదంటున్నారు బుల్లితెర అభిమానులు.