Big Boss 5 Telugu Latest Updates | Difficulty Level of Tasks Increased - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ అరాచకం.. తిండి లేకుండా చేశాడుగా!

Published Wed, Sep 29 2021 12:15 AM

Bigg Boss 5 Telugu: Bigg Boss Increased Dose Of Tasks - Sakshi

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌ రియాల్టీషో  బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో టాస్కుల మోతాదు రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్ని రోజులు కెప్టెన్సీ కంటెడర్‌ టాస్క్‌లుగా చిన్న చిన్న గేమ్స్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఈ సారి మాత్రం టాస్క్‌ ఆడాలంటే బరువు తగ్గాల్సిందేనని కండీషన్‌ పెట్డాడు. మరి ఆ కండీషన్‌ని కంటెస్టెంట్స్‌ ఫాలో అయ్యారా? ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచేందుకు ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఎలాంటి టాస్కులు ఇచ్చాడు? వాటిని ఎలా ఆడారో నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.

గుంట నక్క నేనే కదా: రవి
నిన్నటి నామినేషన్స్‌లో మరోసారి తెరపైకి వచ్చిన గుంటనక్క ఇష్యూని రవి మర్చిపోలేకపోతున్నాడు. గుంటనక్క అని నన్నే అన్నావ్‌ కదా అని నటరాజ్‌ మాస్టర్‌ని రవి అడిగాడు. అయితే మాస్టర్‌ మాత్రం నేరుగా చెప్పకుండా  నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్‌ అని కౌంటర్‌ ఇచ్చాడు.  పికాక్‌ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్‌ చేశాడు నటరాజ్‌ మాస్టర్‌. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్‌ అయ్యాడు రవి. దీంతో నటరాజ్‌ మాస్టర్‌ నవ్వుతూ.. నువ్వు ఇంకొకరి ఇన్‌ఫ్లుయన్స్‌ చేయకు బ్రదర్‌ అని పరోక్షంగా గుంటనక్క నువ్వే అని చెప్పేశాడు. అలాగే ఆ మాట నేను ఎప్పుడో మర్చిపోయానని, కానీ ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి కరెక్ట్‌ పేరు పెట్టావు అని చెప్పాడు అని పరోక్షంగా విశ్వను ఉద్దేశించి అన్నాడు.

ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. నేను ఆ మాట అనలేదు డార్లింగ్‌. ఆ మనిషితో మాట్లాడటమే వేస్ట్‌ అని మాస్టర్‌ని అన్నాడు. మరోవైపు నామినేషన్‌లో లోబో అన్న మాటలకు ప్రియ బాగా హర్ట్‌ అయింది. తను ఏడుస్తుంటే మిగతా సభ్యులంతా వెళ్లి ఓదార్చారు. లోబో వెళ్లి ప్రియని హగ్‌ చేసుకొని ఇద్దరి మధ్య ఉన్న గొడవని పోగొట్టేశాడు.
(చదవండి: బిగ్‌బాస్‌: డేంజర్‌ జోన్‌లో ఆ ముగ్గురు, ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే..)

నన్ను ఫ్రెండ్‌ అని పిలవకు.. రవికి కాజల్‌ వార్నింగ్‌
నిన్నటి నామినేషన్స్‌లో ఆర్జే కాజల్‌ని నామినేట్ చేస్తూ ఆమె ఫిజికల్‌గా తనని కొట్టిందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు యాంకర్ రవి. ఆ మాటకి కాజల్‌ బాగా హర్ట్‌ అయింది. ఒక్కొక్కరి కూల్‌ చేసుకుంటు వస్తున్న రవి.. కాజల్‌తో మాట్లాడేందుకు దగ్గరకు రాగా.. ప్లీజ్‌ రవి..  నీతో నాకు మాట్లాడలని లేదు. ఫిజికల్ అని అంటావా? ఏమనుకోవాలి? నువ్ నాతో మాట్లాడకు రవి అంటూ అక్కడ నుంచి లేచి లోపలికి వెళ్లిపోయి బోరు బోరున ఏడ్చేసింది. 

లవ్‌ అంటే ఏంటో చూపిస్తాం బిగ్‌బాస్‌ : జెస్సీ
బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరూ చిన్న పిల్లాడిగా ట్రీట్‌ చేసే జెస్సి.. తనలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను బయటపెట్టాడు. శ్వేతతో కలిసి శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్‌ పాత్ర ఇచ్చి ఓ టాస్క్‌ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా బిగ్‌బాస్‌.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్‌ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్‌  సాంగ్‌ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. 

తినే తిండిని లాగేసుకున్నాడు
గార్డెన్‌ ఏరియాలో ఓ వేయింగ్‌ స్కేల్‌ ఏర్పాటు చేసి ఇంటి సభ్యులందరి బరువుని కొలిపించాడు బిగ్‌బాస్‌. అనంతరం వారిని బయట ఉంచి, ఇంట్లోకి అజ్ఞాతవాసులు వచ్చి కిచెన్‌లో ఉన్న ఫుడ్‌ ఐటమ్స్‌ అన్ని తీసుకెళ్లారు. దీంతో ఇంటి సభ్యులందరూ కామెడిగా గట్టిగా అరిచారు. డోర్స్‌ ఓపెన్‌ చేశాక ఇంట్లోకి వెళ్లి దాచుకున్న ఫుడ్‌ ఐటమ్స్‌ తినడం మొదలు పెట్టారు. దీంతో ఇంట్లో మిగిలిఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకురావాల్సిందిగా కెప్టెన్‌ జెస్సిని ఆదేశించాడు బిగ్‌బాస్‌. బిగ్‌బాస్‌ ఆర్డర్‌ వేయడంతో చేసేదేమిలేక తినే తిండిని ఇచ్చేశారు కంటెస్టెంట్స్‌. లోబో అయితే ఆపిల్‌ని దాచుకొని మరి తింటూ చివరకు ఇచ్చాడు. సన్నీ కూడా దాచుకున్న ఫుడ్‌ని చాటున తిన్నాడు.
 
జంటలుగా విడిపోయారు
కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను జంటలుగా విడిపోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌. జోడిని ఎంచుకునే చాయిస్‌ని ఇంటి సభ్యులకే ఇచ్చేశాడు. దీంతో జశ్వంత్‌-కాజల్‌, సిరి-షణ్ముఖ్‌, లోబో- నటరాజ్‌ మాస్టర్‌, రామ్‌-హమిదా, యానీ-శ్వేత, ప్రియా- ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్‌ విడిపోయారు. 

గెలవాలంటే తగ్గాల్సిందే..
ఈ వారం కెప్టెన్సీ పోటీదారులకు ‘గెలవాలంటే తగ్గాల్సిందే’టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా ఏ జంట అయితే అందరికంటే ఎక్కువగా బరువుని కోల్పోతారో వారే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తారు. సమయానుసారం బిగ్‌బాస్‌ మీకు కొన్ని చాలెంజర్స్‌ ఇస్తాడు బిగ్‌బాస్‌. దీంట్లో గెలిచిన జంటకు అర కేజీ బరువు తగ్గుతుంది. ఓడిన జంటకు అరకేజీ బరువు పెరుగుతుంది. ఇక టాస్క్‌ అనగానే.. జంటలన్నీ బరువు తగ్గేందుకు వర్కౌట్‌ స్టార్ట్‌ చేశాయి. హమిదా-శ్రీరామ్‌ జంట అయితే ఫుడ్‌తో పాటు వాటర్‌ కూడా తీసుకోవద్దని డిసైడ్‌ అయింది. 

ఫస్ట్‌ చాలెంజ్‌.. పట్టుకోండి చూద్దాం
గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్‌లో భాగంగా తొలి చాలెంజ్‌గా ‘పట్టుకోండి చూద్దాం’అనే గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. దీంట్లో భాగంగా.. పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ పొందిన జంట..తమతో పోటీకి దిగబోయే జంటను ఎంచుకునే అవకాశం ఉటుంది. ఇందులో నటరాజ్‌ మాస్టర్‌-లోబో జంట పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ పొంది శ్రీరామ్‌-హమిదాలను తమ పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ గేమ్‌లో శ్రీరామ్‌-హమిదా జంట విజయ సాధించింది.

Advertisement
Advertisement