బిగ్‌బాస్‌: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు!

Bigg Boss 4 Telugu: These Three Contestants Are Captaincy Contenders - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం మేక పులి గేమ్ న‌డుస్తోంది. పులి ఎదురు చూసి పంజా విసురుతుంద‌ని అభి త‌న‌కు తానే పులి అని ప్ర‌క‌టించుకున్నాడు. అప్ప‌టి నుంచి నాగార్జున కూడా అత‌డిని పులి అని పిల‌వ‌డం మొదలు పెట్టారు. ఇది స‌హించ‌లేక‌పోయాడో లేదా త‌న‌ను మేక అన‌డం భ‌రించ‌లేక‌పోయాడో కానీ అఖిల్ త‌న‌కు తానే పులి అని ప్ర‌క‌టించుకున్నాడు. త‌న మీద జోకులేసిన అభి మీద మాట‌ల‌తో క‌త్తులు దూశాడు. అలా వీళ్లిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అనే అగ్నిగుండం బ‌ద్ధ‌లై ఒక‌రిని ఒక‌రు దూషించుకునే స్థాయికి వెళ్లారు. దీంతో బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్ స‌క్సెస్ అయింది. కానీ అఖిల్ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవుతోంది. క‌రెక్ట్‌ పాయింట్‌ మాట్లాడినా ఆటిట్యూడ్ చూపించ‌డంతో త‌న గొయ్యి తానే తాన త‌వ్వుకుంటున్నట్ల‌వుతోంది. ఇక నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అవినాష్‌, అరియానా, అఖిల్‌, సోహైల్‌.. టాస్కులు ఆడ‌టం లేదంటూ అభిజిత్‌ను నామినేట్ చేశారు. దీనివ‌ల్ల ఓ ర‌కంగా మంచే జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: నాతో జాగ్ర‌త్త‌: సోహైల్‌కు అభిజిత్‌ వార్నింగ్‌)

ఇప్ప‌టివ‌ర‌కు నిద్ర‌పోయిన పులి అభిజిత్ మొద‌టి సారి టాస్కులో త‌న ప్ర‌తాపం చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. బిగ్‌బాస్ ఇంటిని క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌గా మార్చారు. ఇంటిస‌భ్యులంద‌రూ బుల్లెట్ల‌ను త‌ప్పించుకుంటూ బిగ్‌బాస్ చెప్పిన టాస్కుల‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంద‌రితోపాటు అభి కూడా తొలిసారి గేమ్‌ను ఎంజాయ్ కోసం కాకుండా గెల‌వాల‌న్న‌ట్టుగా ఆడుతున్న‌ట్లు అనిపిస్తోంది. మొత్తానికి అభిజిత్‌, హారిక‌, అఖిల్‌ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన‌ట్లు టాక్. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజ‌న్లు లాస్య ఎప్పుడూ టాస్క్ పేప‌రు చ‌దివి వినిపించ‌డ‌మే త‌ప్ప ఆడ‌ద‌ని సెటైర్లు విసురుతున్నారు. పులి వేటాడ‌టం మొద‌లు పెట్టింది, ఇక ఎవ్వ‌రూ తప్పించుకోలేరు అని అభిజిత్ అభిమానులు అంటున్నారు. మ‌రి ఈ టాస్క్‌లో ఎవ‌రెవ‌రు త‌మ సత్తా చూపించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: అభిజిత్ ఆలోచ‌న దిగ‌జారిపోయింది..)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top