అబ్బాయిల‌పై ప్ర‌తాపం చూపించిన‌ నాగ్‌

Bigg Boss 4 Telugu: Nagarjuna Serious On Male Contestants - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ ఇప్పుడు ఐదో వారం ముగింపుకు వచ్చింది. కానీ ఈ సారి ఎలిమినేష‌న్ గంద‌ర‌గోళంగా మారింది. నామినేష‌న్‌లో లేని గంగ‌వ్వ‌ను అనారోగ్య కార‌ణాల‌తో బ‌య‌ట‌కు పంపించిన‌ట్లు లీకువీరులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. ఇదే నిజ‌మైతే ఈ వారం ఎలిమినేష‌న్ ఉంటుందా? లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఇంక ఆ కంటెస్టెంటు ఉండ‌టం అన‌వ‌స‌రం అనుకుంటే మాత్రం ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌క త‌ప్ప‌దు. ఇదిలా వుంటే నాగార్జున తొలిసారి కంటెస్టెంట్ల‌పై విశ్వ‌రూపం చూపించాడు. ప్ర‌తిదానికి సుతి మెత్త‌గా న‌చ్చ‌జెప్పే ఆయ‌న ఇంటిస‌భ్యుల తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కొట్ట‌డానికి కూడా వెన‌కాడ‌ను అని సంకేతాలు ఇవ్వ‌డంతో హౌస్‌మేట్స్‌ షాక్‌లో ఉండిపోయారు. (నేడు బిగ్‌బాస్ హౌస్‌ను వీడ‌నున్న గంగ‌వ్వ‌)

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం... నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అఖిల్‌, అభిజిత్.. మోనాల్‌ను మ‌ధ్య‌లోకి తీసుకురావ‌డంపై నాగ్ సీరియ‌స్ అయ్యారు. ఆమె ఏడుస్తున్నా కూడా ఆమె గురించే మాట్లాడట‌మేంట‌ని ప్ర‌శ్నించారు. నోయ‌ల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ల‌కు కూడా క్లాస్ పీకారు. ఒక‌రికి నువ్వు న‌చ్చ‌లేదంటే అరిచేస్తావా అని సోహైల్‌ను తిట్టిపోశారు. ఇంకోసారి ఇంట్లో ఆడ‌పిల్ల‌ల మీద అరిస్తే కొర‌డా దెబ్బ‌లు తప్ప‌వంటూ కొర‌డాను ఘుళిపించారు. మ‌రి నేటి ఎపిసోడ్‌లో నాగ్ కోపాన్ని ఇంటిస‌భ్యులు ఎలా కూల్ చేస్తారో, ఆయ‌న ఎవ‌రెవ‌రిని సేవ్ చేస్తారో తెలియాలంటే ఇంకొద్ది గంట‌లు ఓపిక ప‌ట్టాల్సిందే. (బిగ్‌బాస్‌: ప్ర‌తిసీజ‌న్‌లో అర్జున్‌రెడ్డిలు వీరే..)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top