భలే చాన్స్‌ కొట్టేసిన మోనాల్‌.. బుల్లితెరపై సందడి

Bigg Boss 4 Telugu: Monal To Become A Dance Show Judge - Sakshi

మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మ‌ధ్య రిలేష‌న్ వీక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన‌క‌ముందు ఈ భామ ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం ద్వారా వ‌చ్చింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చకా.. బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి.  

కొన్ని సినిమాల‌తో పాటు ప‌లు షోల‌లో ఆమె పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా స్టార్ మాలో రేప‌టి నుంచి ప్రసారం కాబోయే డ్యాన్స్ ప్ల‌స్ షోలో మోనాల్ పాల్గొన‌బోతున్న‌ట్లు ఈ మ‌ధ్య‌న వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా దాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తూ ఓ ప్రోమోను విడుద‌ల చేశారు నిర్వాహ‌కులు. అందులో వ‌న్ డే టు గో అంటూ త‌న‌దైన స్టైల్‌లో చెప్పింది మోనాల్. అయితే ఈ షోలో మోనాల్ మెంట‌ర్‌గా ఉండ‌నున్నారా..? లేక జ‌డ్జిగా ఉండ‌బోతున్నారా అనేది నిర్వాహకులు తెలియజేయలేదు. కానీ ఆమె జడ్జిగానే ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షోకి మోనాల్‌తో పాటు బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్, య‌శ్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్ కూడా జడ్జిలుగా ఉండబోతున్నారట. ఇక ఈ షోకు సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. వాటిని చూస్తుంటే ఈ షో ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్న‌ట్లు అర్థమవుతోంది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top