బిగ్‌బాస్ హౌస్‌లోకి జానీ మాస్ట‌ర్‌!

Bigg Boss 4 Telugu: Jani Master May Enter In Bigg Boss House - Sakshi

ల‌వ్ సాంగ్స్‌తో పాటు ఐట‌మ్ పాట‌ల‌కు కూడా అదిరిపోయే స్టెప్పులుండాలంటే జానీ మాస్ట‌ర్ ఉండాల్సిందే. ఆయ‌న కొరియోగ్ర‌ఫీ చేసే ఏ పాటైనా హిట్ అందుకోవాల్సిందే. ఆ రేంజ్‌లో అత‌నికి గుర్తింపు, మార్కెట్ ఏక‌కాలంలో ల‌భించాయి. అయితే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్‌లో నృత్య ద‌ర్శ‌కుడు జానీ మాస్ట‌ర్ పాల్గొన‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఇప్ప‌టికే 'ఢీ' షోలో జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా "బాపు బొమ్మ‌కి పెళ్లంట" అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోనూ పాల్గొని సంద‌డి చేశారు. మ‌రి ఆయ‌న బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెడితే ఏమేర‌కు సంద‌డి ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. జానీ మాస్ట‌ర్‌తో పాటు కొరియోగ్రాఫ‌ర్‌ ర‌ఘు మాస్ట‌ర్‌కు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునే అవ‌కాశాలున్నాయి. (బిగ్‌బాస్‌-4 ఎంట్రీపై తరుణ్‌ క్లారిటీ)

కాగా గ‌త సీజ‌న్‌లో కొరియోగ్రాఫ‌ర్‌ బాబా భాస్కర్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న డ్యాన్స్ క‌న్నా ఎక్కువ‌గా కామెడీని పండిస్తూ ప్రేక్ష‌కుకుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. ఈ క్ర‌మంలో ఈసారి కూడా కొరియోగ్రాఫ‌ర్‌ను తీసుకు వ‌స్తే షోకు అద‌న‌పు హంగు వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌లో ఉంది బిగ్‌బాస్ టీం. అలాగే గ‌త సీజ‌న్ విన్న‌ర్‌గా నిలిచిన రాహుల్ క్లోజ్ ఫ్రెండ్, సింగ‌ర్‌ నోయ‌ల్‌ను కూడా షోలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. దీంతో అన్ని రంగాల నుంచి ఒక్కొక్క‌రిని తీసునేందుకు ఇదివ‌ర‌కే ప్లాన్ రెడీ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్న బిగ్‌బాస్ యాజ‌మాన్యం అధికారిక కంటెస్టెంట్ల లిస్టును వెల్ల‌డించేవ‌ర‌కు వేచి చూడాల్సిందే. (బిగ్‌బాస్‌: ఒక్క వారానికి రూ.16 కోట్లు?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top