బిగ్‌బాస్‌: ప‌ది ల‌క్ష‌లు వ‌దిలేసుకున్న అరియానా | Bigg Boss 4 Telugu: Ariyana Denied To Take Rs 10 Lakhs | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ప‌ది ల‌క్ష‌లు వ‌దిలేసుకున్న అరియానా

Dec 20 2020 8:55 PM | Updated on Dec 21 2020 2:15 AM

Bigg Boss 4 Telugu: Ariyana Denied To Take Rs 10 Lakhs - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ కోసం పంతొమ్మిది మంది పోటీ ప‌డ‌గా ఫినాలేకు ఐదుగురు చేరుకున్నారు. వీరిలో హారిక మొద‌ట ఎలిమినేట్ అయింది. త‌ర్వాత ఉన్న న‌లుగురితో డీల్ మాట్లాడేందుకు ప్ర‌ణీత లోప‌ల‌కు వ‌చ్చారు. ప‌ది ల‌క్ష‌లు తీసుకుంటారా? అని డీల్ మాట్లాడారు. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండ‌ని వారికి స‌ల‌హా ఇచ్చారు. అయితే ప్రేక్ష‌కుల ఓట్లే మాకు ముఖ్య‌మంటూ వారు ఆ డ‌బ్బు తీసుకునేందుకు నిరాక‌రించారు. దీంతో ఈ డీల్ కుద‌ర‌ట్లేద‌ని ప్ర‌ణీత సూట్‌కేస్ తీసుకుని వెళ్లిపోయింది. త‌ర్వాత నాగ్ అరియానా ఎలిమినేట్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో షాకైన అరియానా ఓ క్ష‌ణం పాటు నిశ్చేష్ఠురాలై నిల‌బ‌డిపోయింది. ఆపై స్టేజీ మీద‌కు వ‌చ్చి మాట్లాడుతూ ఓ వైపు బాధగా ఉన్నా‌, మ‌రోవైపు ప్రేక్ష‌కుల ప్రేమ దొరికినందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పింది. ప‌దిహేను వారాలు ఉండి మంచి పేరుతో వెళ్తున్నందుకు హ్యాపీ అంది. బిగ్‌బాస్‌కు వెళ్ల‌క ముందు, ఇప్ప‌టికీ చాలా స‌న్న‌బ‌డిపోయావు అని నాగ్ అడ‌గ్గా.. అవినాష్ వెళ్లిపోయాక‌ తినిపించేవాళ్లు లేక స‌న్న‌బ‌డ్డానంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: గంగవ్వకు మెహబూబ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌)

అరియానా గురించి చెప్పాలంటే ఆమె ఓ ఫైట‌ర్‌. హౌస్ అంతా ఏక‌మై త‌న‌కు వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డా ఆమె మాత్రం ఎప్పుడూ వెన‌క‌డుగు వేయ‌లేదు. త‌న‌కు ఎదురయ్యే ఒక్కో స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తూ మ‌రింత బ‌లంగా మారుతూ వ‌చ్చింది. టాస్కుల్లోనూ మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా ఆడుతూ వారికి గ‌ట్టి పోటినిచ్చింది. అయితే ఆమె కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు స్ట్రిక్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల మిగ‌తా ఇంటిస‌భ్యులు ఆమెకు మ‌న‌సు లేద‌ని నిందించేవారు. దీంతో ఇంటిస‌భ్యులు ఆమెను ఈ సీజ‌న్‌లోనే వ‌ర‌స్ట్ కెప్టెన్‌గా పేర్కొ న్నారు. కానీ నాగార్జున మాత్రం ఆమెను బెస్ట్ కెప్టెన్‌గా అభివ‌ర్ణించ‌డం విశేషం. (చ‌ద‌వండి: అరియానా, ఇంత అందంగా ఎట్లున్న‌వే: సోహైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement