బిగ్‌బాస్‌: అభిజిత్‌పై మాస్ట‌ర్ సీరియ‌స్‌

Bigg Boss 4 Telugu: Abhijeet Directions To Akhil, Monal Love Scene - Sakshi

టాస్కేదైనా అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు గొడ‌వ ప‌డ‌టం మామూలైపోయింది. బిగ్‌బాస్ సినిమా తీయ‌మ‌ని చెప్తే అందులో కూడా మాస్ట‌ర్ అభిజిత్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఇది కూడా సినిమాలో ఒక భాగ‌మా? లేదా నిజంగానే త‌గ‌వు ప‌డ్డారా? తెలియాల్సి ఉంది. ఇక సినిమాలో అఖిల్‌, మోనాల్ హీరోహీరోయిన్లుగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. వారికి ఓ ద‌ర్శ‌కుడిగా అభిజిత్ ప్రేమ‌పాఠాలు నేర్పించాల్సి ఉంటుంది. దీంతో అభి వీళ్ల ల‌వ్ ట్రాక్‌కు తాను డైరెక్ష‌న్ చేయ‌డ‌మేంట్రా దేవుడా అని త‌ల ప‌ట్టుకున్నాడు. ఈ ప్రేమ ఎపిసోడ్ చూడ‌లేక మాస్ట‌ర్ బ‌య‌ట‌కు వెళ్లిపోతాన‌ని పంచ్ వేశాడు. అరియానా, అవినాస్ బావామ‌ర‌ద‌ళ్లుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అన్నీ మంచి పాత్ర‌లే ఉంటే అది సినిమా ఎందుక‌వుతుంది. అందుకే ఈ ప్రేమ పావురాల‌ను విడ‌దీసేందుకు విల‌న్‌ మెహ‌బూబ్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. వ‌చ్చీరాగానే హీరో మీద ప‌డి చిత‌క్కొడుతున్నాడు. (ఫిజిక‌ల్ టాస్కుల‌‌కు దూరంగా అభిజిత్)

ఇక ఏదో సంద‌ర్భంలో సీన్ బాలేద‌ని అవినాష్ అభిజిత్ డైరెక్ష‌న్‌ను అన్నాడు. మాస్ట‌ర్ కూడా.. ఏంట‌స‌లు? నేనొక‌టి అడుగుతుంటే నువ్వు వేరేలా మాట్లాడుతున్నావేంటి అని అభిపై సీరియ‌స్ అయ్యాడు ఓవ‌ర్ సీన్ చూపిస్తున్నావ్ అని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. హారిక‌, సోహైల్ ఐట‌మ్ సాంగ్‌కు చిందులేశారు. చాలా రోజుల త‌ర్వాత లాస్య మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. మొన్న రాక్ష‌సుల టాస్కులో కూడా జోకుటు వేయ‌గా వీళ్లు చేస్తున్న సినిమాకు బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ తోపు.. ద‌మ్ముంటే ఆపు అని ఓ ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ చెప్పింది. ఏదైతేనేం.. ఈరోజు కంటెస్టెంట్లు మ‌నంద‌రికీ పసందైన‌ సినిమా చూపించ‌బోతున్నారన్న‌మాట‌. (అంద‌రి కోసం అభిజిత్‌కు అన్యాయం చేసిన అరియానా)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top