అఖిల్‌కు ఏమైందో అర్థం కావ‌ట్లేదు: మోనాల్‌

Bigg Boss 4 Telugu: Abhijeet Conversation With Monal - Sakshi

ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట ప‌క్షులు అఖిల్‌, మోనాల్ అర్ధాంతరంగా విడిపోయారు. నామినేష‌న్ అంటే చాలు ఠారెత్తిపోయే అవినాష్ త‌ను సేవ్ అయ్యేందుకు ఓ ర‌కంగా మోనాల్‌తో యుద్ధ‌మే చేశాడు. గ‌ట్టిగా మాట్లాడుతూ త‌న వాద‌నే నిజ‌మ‌ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నించిన అరియానా ప‌థ‌కం కూడా పార‌లేదు. ఇంత‌మందితో పోరాడిన మోనాల్ చివ‌రికి కెప్టెన్ హారిక వ‌ల్ల నామినేష‌న్స్‌లోకి వెళ్లింది. అస‌లు మోనాల్‌తో స్వాప్‌(స్థానాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డం) చేసుకోన‌ని అభి తేల్చి చెప్పినప్ప‌టికీ కెప్టెన్ త‌న ప‌వ‌ర్‌ను ఉపయోగిస్తూ అత‌డిని నామినేష‌న్ గండం నుంచి గ‌ట్టెక్కించి మోనాల్‌ను బ‌లి చేసింది. మొత్తానికి నిన్న‌టి ఎపిసోడ్ హౌస్‌లోని వాతావ‌ర‌ణాన్ని హీటెక్కిచ్చింది. (బిగ్‌బాస్‌: రికార్డుల వేట‌లో అభిజిత్ ఫ్యాన్స్‌)

ముఖ్యంగా అఖిల్‌, మోనాల్ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. మోనాల్ త‌నను మోసం చేసింద‌న్న భ్ర‌మ‌లో అఖిల్ కూరుకుపోయాడు. అటు మోనాల్ మాత్రం హారిక‌తో అఖిల్ సూప‌ర్‌ జెన్యూన్ అని, కానీ ఈ మ‌ధ్య అత‌డికి ఏమైందో అర్థం కావ‌ట్లేద‌ని కంట‌త‌డి పెట్టుకుంది. బాధ‌లో ఉన్న మోనాల్‌ను ఓదార్చేందుకు అభి ఆమెతో మాట‌లు క‌లిపాడు. నువ్వు మా నాన్న‌కు నచ్చ‌డ‌మేంటో అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. దీంతో అభి, మోనాల్ క‌థ‌ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. మరోవైపు అవినాష్‌కు ఫ్ర‌స్టేష‌న్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. నామినేట్ అయినందుకు అరియానా క‌న్నీళ్లు పెట్టుకోగా ఏడ‌వ‌కు, ఏడిస్తే మ‌నం సేవ్ అవ‌మూ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. క‌ష్ట‌ప‌డి టాస్కులు ఆడ‌న‌వ‌స‌రం లేద‌ని అర్థ‌మైందంటూ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇక‌ ఈ వారం అవినాష్ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నాడు. (బిగ్‌బాస్‌: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top