Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు లైవ్‌లో ఏడ్చిన నటి, వీడియో వైరల్‌

Bhojpuri Actress Akanksha Dubey Broke Down in Tears Before Death, Video Viral - Sakshi

యువ నటి ఆకాంక్ష దూబే(25) ఆత్మహత్యతో భోజ్‌పురి చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఓ సినిమా షూటింగ్‌ కోసం వారణాసి వెళ్లిన ఆమె ఆదివారం అక్కడి హోటల్‌ గదిలో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఇంత చిన్నవయసులో బలవన్మరణానికి పాల్పడేంత కష్టం ఏమొచ్చిందంటూ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే తను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌కి వచ్చింది నటి.

ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన ఆమె దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ కంటతడి పెట్టుకుంది. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇది సూసైడ్‌ కాదని తనను మెంటల్‌ టార్చర్‌ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. తనతో ఉన్న ఫోటోలను కూడా తరచూ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన కెరీర్‌ విషయానికి వస్తే.. మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది ఆకాంక్ష. ముజ్‌సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్టుల్లో నటించింది. 

NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
►ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
►మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top