భీమదేవరపల్లి బ్రాంచి దర్శకుడి ‘లగ్గం’ స్టార్ట్‌

Bheemadevarapally Branchi Film Director Ramesh Cheppala Latest Movie Updates - Sakshi

‘భీమదేవరపల్లి బ్రాంచి’మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రమేశ్‌ చెప్పాల. తెలంగాణ కల్చర్‌తో పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం.. థియేటర్స్‌లో సరిగా ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. అమెజాన్‌ ఫ్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం..ఇప్పటికే 200 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు కొత్త సినిమాను ప్రకటించాడు. లగ్గం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ చిత్రంలో ప్రముఖ హీరో, హీరోయిన్ తో పాటు అనేక మంది మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. జనవరి 16 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ సబ్జెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, పెళ్లి కల్చర్ ఉంటుందట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియస్తామని దర్శకుడు తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top