గ్రామీణ నేపథ్యంతో 'బరి'.. ఫస్ట్‌ లుక్, టీజర్‌ విడుదల | Bari Movie First Look And Teaser Released | Sakshi
Sakshi News home page

Bari Movie: గ్రామీణ నేపథ్యంతో 'బరి'.. ఫస్ట్‌ లుక్, టీజర్‌ విడుదల

Jan 10 2022 6:42 PM | Updated on Jan 10 2022 6:46 PM

Bari Movie First Look And Teaser Released - Sakshi

Bari Movie First Look And Teaser Released: రాజు,  సహాన జంటగా సురేష్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బరి'. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను  సోమవారం ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి చేతులమీదుగా విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌తోపాటు టైటిల్‌ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయని రాజ్‌ కందుకూరి తెలిపారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'ఈ సినిమాతో నేను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నా. ద‌ర్శ‌కుడు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి అంద‌రికీ న‌చ్చే విధంగా సినిమా తెర‌కెక్కించారు. టీమ్‌ని న‌మ్మి మా నిర్మాత ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.' అని హీరో రాజు చెప్పుకొచ్చాడు. 

ఈ  సినిమా గ్రామీణ నేపథ్యంలో కోడి పుంజులు, కోడి పందేలు ప్రధానంశంగా తెరకెక్కనున్నట్లు డైరెక్టర్‌ సురేష్‌ రెడ్డి వెల్లడించారు. రేపల్లె, బాపట్ల, తెనాలి ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నాడు. నాలుగు పాటలున్న ఈసినిమా ఆడియోను త్వరలో లాంచ్‌ చేస్తామన్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. 'మాది బెంగళూరు అయినా సినిమాల మీద ఉన్న ఇష్టంతో తొలి సినిమాగా 'బ‌రి' చిత్రాన్ని నిర్మించాను. టీమ్ అంతా హార్డ్ వ‌ర్క్ చేశారు. సినిమా అంతా పూర్త‌యింది. ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇంత వ‌ర‌కు రాని క‌థాంశంతో ఈ సినిమా చేశాను. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని కోరుకుంటున్నా' అని నిర్మాత మునికృష్ణ పేర్కొన్నారు.



ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్‌ ఫిదా.. జాన్వీ కపూర్‌ ప్రశంసలు

Advertisement
 
Advertisement
Advertisement