అమెరికా, ఇండియా ఏదైనా సరే ఈ సమస్య 'వింటారా సరదాగా' (టీజర్‌) | Ashok Galla movie Vintara Saradaga TEASER Out Now | Sakshi
Sakshi News home page

అమెరికా, ఇండియా ఏదైనా సరే ఈ సమస్య 'వింటారా సరదాగా' (టీజర్‌)

Jul 12 2025 11:40 AM | Updated on Jul 12 2025 12:25 PM

Ashok Galla movie Vintara Saradaga TEASER Out Now

అశోక్‌ గల్లా హీరోగా నటించిన మూడో సినిమా 'వింటారా సరదాగా' (Vintara Saradaga) నుంచి తాజాగా టీజర్విడుదలైంది. ఇప్పటికే ఆయన దేవకీనందన వాసుదేవ, హీరో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు కడుపుబ్బా నవ్వించేందుకు మళ్లీ వస్తున్నాడు. అశోక్‌ గల్లా హీరోగా, రాహుల్‌ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా నటించిన 'వింటారా సరదాగా' చిత్రం రొమాంటిక్‌ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్‌ తెరకెక్కించనున్నారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరించనుంది.

విదేశాల్లోని విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా వినోదాత్మకంగా, సరికొత్తగా సినిమా టీజర్ఉంది. ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా' అని చెప్పవచ్చు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందంగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement